తిప్పాపూర్‌లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
వేములవాడ :
వేములవాడ పట్టణంలోని తిప్పపూర్ లో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు,కార్యకర్తలు పాల్గొని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, పుష్పాంజలి ఘటించారు. భారతదేశాన్ని సన్మార్గంలో నడిపించిన మహానుభావుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని పట్టణ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా ఐటి, విద్యా, టెలికాం, రక్షణ, వాణిజ్య, సంస్కరణలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. అంతేకాకుండా దేశ అభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన కృషి, సమాచార విప్లవానికి బాటలు వేసిన దూరదృష్టి ఎప్పటికీ స్మరణీయమని పేర్కొన్నారు. యువతకు ఆయన ఆలోచనలు ప్రేరణనిస్తాయని, ఆయన కలల భారతాన్ని సాకారం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాబీర్, నాయకులు కూరగాయల కొమరయ్య, చిలుక రమేష్, నామాల లక్ష్మిరాజం,ఇప్పపుల అజయ్,పీర్ మహమ్మద్,నాగుల విష్ణు, సయ్యద్ సాబీర్,వస్తాది కృష్ణ,నాగుల మహేష్, తోటరాజు,మల్లేశం, ఇన్నారం సాగర్, కట్కూరి శ్రీనివాస్, ముప్పిడి శ్రీధర్, కోయల్ కారం మస్తాన్ వలి, రజాక్, అక్కన పెళ్లి నరేష్, షాహిద్, ఇర్ఫాన్, కూర దేవయ్య అంబాటి చందు, సాయిని అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.