ముధోల్ కు 45.15 కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మంజూరు.
ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్.
ఉమ్మడి అదిలాబాద్ ( నిర్మల్ ) : ముధోల్ తాలూకా లో 45.15 కోట్ల రూపాయల నిధులతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నామని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలియజేశారు.. గతం లో ఇక్కడ ఐటిఐ కళశాల ( టెక్నాలజీ సెంటర్ )మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి ని కోరడం తో పాటు అసెంబ్లీ లో ప్రస్తావించడం తో ముధోల్ లో ఎ. టి. సి. సెంటర్ ఏర్పాటు కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంతోషకరమన్నారు. ఈ కేంద్రం ద్వారా విద్యార్థులకు ఎంతో ప్రయోజన కరంగా ఉంటుందన్నారు. కార్మిక, ఉపాధి కల్పన ఆధ్వర్యంలో టాటా టెక్నాలజీ భాగస్వామ్యంతో కేంద్రం కొనసాగుతుందన్నారు. విద్యార్థులకు,నిరుద్యోగ యువత శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లో అవకాశం కల్పిస్తారన్నారు. ఎ. టి. సి. ఏర్పాటు కావడం శుభసూచక మన్నారు. 45 కోట్ల నిధులతో భవన నిర్మాణాలు, యంత్రాలు, కంప్యూటర్ లు, ఇతరత్ర సౌకర్యాలు కల్పిస్తారన్నారు.. ఈ సందర్భంగా ప్రభుత్వానికి టాటా కంపెనికి ఎమ్మెల్యే ధన్యవాదములు తెలిపారు..