అభివృద్ధి పనులను జాతరలా ప్రారంభించన కలెక్టర్
ఏటూర్ నాగారం/ములుగు జిల్లా :
వివిధ రకాల అభివృద్ధి పనులను చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాన్ని
శుక్రవారం ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామపంచాయతీలో పనులను జాతరలా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు తో కలిసి ఘనంగా ప్రారంబించారు.
గ్రామంలో ప్రతి కుటుంబానికి చెందిన సభ్యులు జాబ్ కార్డు వినియోగించుకొని ఉపాధి హామీ పథకం ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నారు. కొత్తగా ఎవరికైనా పనులు కావలసిన సందర్భంలో, సంబంధిత అధికారులు అవసరమైన సహాయం అందిస్తారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకంలో అత్యుత్తమంగా పనిచేసిన కార్మికులు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పెంపకానికి సేవలందించిన వారు, పారిశుధ్య కార్యక్రమాల్లో పాల్గొన్న దివ్యాంగులు తదితరులకు కలెక్టర్ శాలువ తో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎం పి డి ఓ శ్రీనివాస్, ఎం పి ఓ, ఏ పి ఓ, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.