
ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ), ఆగష్టు 19::
ప్రజలందరికీ ఆరోగ్యాన్ని అందించడంలో ఆర్ఎంపీల పాత్ర చాలా ఉందని జిల్లా ఆర్ఎంపి సంఘం అధ్యక్షులు బొమ్మినేని కొండలరావు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని రావినూతల గ్రామంలో మంగళవారం ఆర్.ఎం.పి గోపి నివాసం వద్ద ఆ సంఘం మండల అధ్యక్షులు యంగల గౌతం అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు,ఈ సందర్భంగా కొండలరావు మాట్లాడుతూ తెలంగాణలోని ఆర్ఎంపీలకు వైజ్ఞానిక శిక్షణ ఇచ్చి అధికారిక సర్టిఫికెట్లను ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు ప్రాథమిక స్థాయిలో వైద్యం అందిస్తున్న గ్రామీణ వైద్యులైన ఆర్ఎంపీ, పీఎంపీల సేవలను మెరుగుపరచాలన్నారు.గత ప్రభుత్వంలో ఇచ్చిన 429జీవోలను అమలు చేసి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు జారీ చేసి వాళ్ళ స్థాయిలో వైద్యం అందే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందన్నారు.పేద ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం చేస్తున్న వాళ్లపైన కేసులు బనాయించడం,అరెస్టు చేయడం అనేది ఈ సమస్యకు పరిష్కారం కాదన్నారు.సంఘం మండల అధ్యక్షులు యం గౌతం మాట్లాడుతూ గత ప్రభుత్వాలు తమకి ఇచ్చిన జీవోలు అమలు చేసి ఆర్ఎంపీలకు పరిధి విధించి ఆ పరిధిలో వైద్యం చేసే విధంగా చేయడమే దానికి సరైన పరిష్కార మార్గమని తెలిపారు,దాడులు జరుగుతున్నాయని వైద్యవృత్తికి దూరంగా ఉండకుండా ప్రాథమిక చికిత్స అందిస్తూ జాగ్రత్తలు పాటించాలన్నారు, సంఘ సభ్యులకు అన్నివేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యులు జేడి మూర్తి,ఎస్కే ఖాసీం,ఎస్కే పెంటూ సాహెబ్,మండల కార్యదర్శి టీ బాలు,మండల కమిటీ సభ్యులు మర్రి కరణం,సుధాకర్,పలు మండలాల ఆర్ఎంపిల నాయకులు,స్థానిక ఆర్ఎంపిలు పాల్గొన్నారు.