పోటీ పరీక్షలకు ఉచిత ఫౌండేషన్ కోచింగ్
జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జగదీష్
సంగారెడ్డి, భారత శక్తి ప్రతినిధి, జూలై19: రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థులకు గ్రూప్స్, ఆర్ఆర్ఆర్బీ ఎస్ఎస్ఎస్సి బ్యాంకింగ్ రిక్రూట్మెంట్లకు పోటీ పరీక్షలకు ఉచిత ఫౌండేషన్ కోచింగ్ ప్రోగ్రామ్ 2025 ఆగస్టు 25 నుంచి 150 రోజుల పాటు నిర్వహించినట్లు సంగారెడ్డి బీసీ వెనుకబడిన తరగతుల శాఖ అధికారి ఆకారం జగదీష్ ఒక ప్రకటనలో తెలిపారు.
అర్హులైన www.tgbcstudy circle. Cgg. Gov. In ద్వారా ఈనెల 16 నుండి ఆగస్టు 11 తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.అభ్యర్థులు పూర్తిచేసి తల్లిదండ్రుల వార్షిక ఆదాయము గ్రామీణ ప్రాంతంలో రూపాయలు 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాలలో 2 లక్షల లోపు కలిగి ఉండాలని తెలిపారు. డిగ్రీ పరీక్షల్లో వచ్చిన మార్కులు, రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము అభ్యర్థుల ఎంపిక విధానము ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 08455-277015 /9949 592991 నెంబర్లను లేదా బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయం వెలుగు ఆఫీస్ క్యాంప్ క్యాంపస్ బైపాస్ రోడ్ సంగారెడ్డి నందు ఆఫీస్ వేళలో నేరుగా సంప్రదించవచ్చు అని తెలిపారు.