రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగించేలా
ప్రతి నాయకుడు కార్యకర్త కృషి చేయాలి... శానంపూడి సైదిరెడ్డి
నల్గొండ జిల్లా బ్యూరో (భారత శక్తి) జూలై22:
నల్గొండ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల కార్యక్రమంలో హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే మరియు బీజేపీ రాష్ట్ర నాయకులు శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ భారత జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన నాటినుండి కేంద్రం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి గ్రామ గ్రామాన నిధులు కేటాయిస్తూ ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో,కార్మికులకు కర్షకులకు ఉపాధి హామీ కూలీలకు కేంద్రం నిధులు ఇచ్చి మరీ అభివృద్ధి చేస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగించేలా ప్రతి నాయకుడు కార్యకర్త కృషి చేయాలన్నారు.
About The Author
02 Aug 2025