ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు
37లక్షల చెక్కులు పంపిణీ చేసిన గంగుల
కరీంనగర్ :తెలంగాణ సిద్ధాంత కర్త, ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం కరీంనగర్ నగరంలోని మదీనా చౌక్ వద్ద జయశంకర్ విగ్రహానికి మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పూలమాల వేసి ఘనంగా నివాళ్లర్పించారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
37 లక్షల చెక్కుల పంపిణీ :
37 లక్షల 86వేల సీఎం రిలిప్ పాండ్ చెక్కులను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గంగుల కమలాకర్ బాధితులకు పంపిణీ చేశారు.
కరీంనగర్ నియోజకవర్గంలోని 168 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు 37లక్షల 86వెయ్యిల 500 రూపాయల విలువ గల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు చల్ల హరి శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, మాజీ కార్పొరేటర్లు.. తదితరులు పాల్గొన్నారు.