మల్లికార్జున్ ఖర్గే కి జన్మదిన శుభాకాంక్షలు
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, జులై 21:
మరింత రెట్టింపు ఉత్సాహంతో ఆయురారోగ్యాలతో ఉంటూ, కాంగ్రెస్ పార్టీకి దిశా నిర్దేశం చేస్తూ, పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని కోరుతూ, ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సోమవారం ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఖర్గేగారు కలకాలం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇంకొన్నేళ్లు దేశానికి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నా అని అన్నారు. అదే విధంగా భారత ప్రజల పట్ల మీ నాయకత్వం, నిబద్ధత, అంకితభావం ఎల్లప్పుడూ మా అందరికీ స్ఫూర్తినిస్తాయని ఆయన అన్నారు.
About The Author
02 Aug 2025