ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
జెండాను ఆవిష్కరించిన అధ్యక్షుడు మహమ్మద్ రఫీక్
వేములవాడ,ఆగస్టు15 (భారత శక్తి) : వేములవాడ పట్టణంలోని టీయూడబ్ల్యూజే హెచ్ 143 ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మహమ్మద్ రఫీక్ జర్నలిస్టుల సమక్షంలో జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.దేశ భక్తితో జై జవాన్..జై కిసాన్..వందేమాతరం అంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రఫీ లు మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల ఫలితమే నేటి స్వతంత్ర దినోత్సవమని కొనియాడారు.దేశం కోసం పోరాడిన మహనీయులను త్యాగాలను గుర్తు చేస్తూ మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.మహనీయులు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షించారు. దేశం కోసం పోరాడి అమరులైన లక్షలాదిమంది భారత అమరవీరులను స్మరించుకోవడం భారత దేశ పౌరునిగా మన అందరి బాధ్యతని పేర్కొన్నారు. మాతృభూమి స్వతంత్రం కోసం పోరాడిన మహనీయులు చిరస్మరణీయులని వారి అమరత్వాన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కొలిపాక నర్సయ్య, జిల్లా ఉపాద్యాక్షులు రాంప్రసాద్,టెంజు ప్రధాన కార్యదర్శి అజీమ్,జితేందర్ రావు, సీనియర్ పాత్రికేయులు రసూల్, ఉపాధ్యక్షులు సయ్యద్ అలి, కొత్వాల్ శ్రీనివాస్,నేరెళ్ల కమలాకర్, చింతల తాడెం దేవరాజు,దబ్బేటి ప్రవీణ్, షేక్ రియాజ్,విష్ణు,సాయి,శ్రీకాంత్ జింక శ్రీధర్, కొడెం గంగాధర్,జబ్బార్, పంపరి నాగరాజు,బండి హరీష్, అజార్,ప్రసాద్,నయిమొద్దీన్, సంతోష్,ఇమ్రాన్,శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.