టియూడబ్ల్యూజే సభ్యత్వ నమోదులో అవకతవకలు

కరీంనగర్, జనవరి 31(భారత శక్తి): గత ఏడాది డిసెంబర్ లో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు కరీంనగర్ జిల్లా శాఖకు జరిగిన ఎన్నికల నిర్వహణలో పూర్తిగా అవకతవకలు జరిగాయని, యూనియన్ సభ్యుడు చెలుకల రామకృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్, కార్మిక శాఖకు పిర్యాదు చేసిన సంగతి తెలిసిందే…ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించలేదని, పూర్తిగా ఒక వర్గానికి కొమ్ముకాసేలా వ్యవహరించారని ఆరోపిస్తూ కార్మిక శాఖకు సైతం పిర్యాదు చేసినారు. ఎన్నికల నిర్వహణ తిరు నిబంధనలకు విరుద్ధంగా , అదనంగా అనర్హులైన జర్నలిస్టులతో ఆప్పటికప్పుడు సభ్యత్వాలను నమోదు చేసి ఆ దొంగ ఓట్లతో పోలింగ్ నిర్వహించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదే ఎన్నికల్లో పోటీ చేసిన రామకృష్ణారెడ్డి ఈ ప్రక్రియపై పలు అభ్యంతరాలు ఆ సమయంలో లేవనెత్తారు. ఎన్నికల సందర్భంగా సభ్యత్వ జాబితా అందుబాటులో ఉంచకపోవడం, సభ్యత్వం నమోదు జరిగిన తీరుపై అనేక సందేహాలను పోటీచేసిన సభ్యులు విమర్శలు గుప్పించారు. ఎన్నికలు నిర్వహించిన ఆడ్ హక్ కమిటీ, రిటర్నింగ్ అధికారులు పట్టించుకోకుండా గతేడాది డిసెంబర్ 11వ తేదిన నిర్వహించిన సంగతి జర్నలిస్టులకు తెలిసిందే . ఈ ఎన్నికల్లో సభ్యత్వం లేనివారికి, అప్పటికప్పుడు దొంగ సభ్యత్వం నమోదు చేయించి ఎన్నికల్లో పోటీకి నిలిపితే కొంత సేపు పోలింగ్ గందరగోళానికి దారి తీయగా అప్పుడే అర్హులైన, నికార్సయిన జర్నలిస్టులు ఎన్నికల అధికారులను నిలదీశారు. అయితే ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరగలేదని, అభ్యంతరాలు ఉన్నాయని డిసెంబర్ 16వ తేదిన కార్మిక శాఖకు పిర్యాదు చేశారు రామక్రిష్ణారెడ్డి.. ఎన్నికల నిర్వహణలో యూనియన్ బైలాకు వ్యతిరేకంగా, మేనేజింగ్ ఎడిటర్లు, యాజమాన్య ప్రతినిధులకు, స్థానికేతరులకు, విలేకరులు కానీ వారికి సభ్యత్వం కల్పించారని పిర్యాదు పేర్కొన్నారు. గతంలో యూనియన్ అపిస్ బెరర్లుగా పనిచేసిన వారితో పాటు, పలువురు సీనియర్ సభ్యులకు ముందస్తు సమాచారం లేకుండా సభ్యత్వం లేకుండా తొలగించారని పిర్యాదు చేశారు.అయితే జిల్లా కలెక్టర్, కార్మిక శాఖ అధికారులకు పిర్యాదు చేసిన పాట్టించుకోకపోవడంతో యూనియన్ సభ్యుడు రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.. అలాగే తాజాగా జరిగిన ఎన్నికల్లో నూతనంగా గెలిచినా అధ్యక్షుడు యూనియన్ ప్రకారం ప్రాథమిక సభ్యత్వానికే అనర్హుడని, సంబధిత సాక్ష్యాలతో సహా హైకోర్టు లో కేసు దాఖలు చేశారు. రామకృష్ణారెడ్డి ఫిర్యాదును హైకోర్టు పరిగణనలోకి తీసుకొనీ జిల్లా కలెక్టర్, కరీంనగర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ శాఖకు వెంటనే అవకతవలపై విచారణ చేపట్టాలని ఉత్తర్వుల్లో ఆదేశాలు జారీచేశారు.

టియూడబ్ల్యూజే సభ్యత్వ నమోదులో అవకతవకలు

కరీంనగర్, జనవరి 31(భారత శక్తి):
గత ఏడాది డిసెంబర్ లో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు కరీంనగర్ జిల్లా శాఖకు జరిగిన ఎన్నికల నిర్వహణలో పూర్తిగా అవకతవకలు జరిగాయని, యూనియన్ సభ్యుడు చెలుకల రామకృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్, కార్మిక శాఖకు పిర్యాదు చేసిన సంగతి తెలిసిందే…ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించలేదని, పూర్తిగా ఒక వర్గానికి కొమ్ముకాసేలా వ్యవహరించారని ఆరోపిస్తూ కార్మిక శాఖకు సైతం పిర్యాదు చేసినారు. ఎన్నికల నిర్వహణ తిరు నిబంధనలకు విరుద్ధంగా , అదనంగా అనర్హులైన జర్నలిస్టులతో ఆప్పటికప్పుడు సభ్యత్వాలను నమోదు చేసి ఆ దొంగ ఓట్లతో పోలింగ్ నిర్వహించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదే ఎన్నికల్లో పోటీ చేసిన రామకృష్ణారెడ్డి ఈ ప్రక్రియపై పలు అభ్యంతరాలు ఆ సమయంలో లేవనెత్తారు. ఎన్నికల సందర్భంగా సభ్యత్వ జాబితా అందుబాటులో ఉంచకపోవడం, సభ్యత్వం నమోదు జరిగిన తీరుపై అనేక సందేహాలను పోటీచేసిన సభ్యులు విమర్శలు గుప్పించారు. ఎన్నికలు నిర్వహించిన ఆడ్ హక్ కమిటీ, రిటర్నింగ్ అధికారులు పట్టించుకోకుండా గతేడాది డిసెంబర్ 11వ తేదిన నిర్వహించిన సంగతి జర్నలిస్టులకు తెలిసిందే . ఈ ఎన్నికల్లో సభ్యత్వం లేనివారికి, అప్పటికప్పుడు దొంగ సభ్యత్వం నమోదు చేయించి ఎన్నికల్లో పోటీకి నిలిపితే కొంత సేపు పోలింగ్ గందరగోళానికి దారి తీయగా అప్పుడే అర్హులైన, నికార్సయిన జర్నలిస్టులు ఎన్నికల అధికారులను నిలదీశారు. అయితే ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరగలేదని, అభ్యంతరాలు ఉన్నాయని డిసెంబర్ 16వ తేదిన కార్మిక శాఖకు పిర్యాదు చేశారు రామక్రిష్ణారెడ్డి.. ఎన్నికల నిర్వహణలో యూనియన్ బైలాకు వ్యతిరేకంగా, మేనేజింగ్ ఎడిటర్లు, యాజమాన్య ప్రతినిధులకు, స్థానికేతరులకు, విలేకరులు కానీ వారికి సభ్యత్వం కల్పించారని పిర్యాదు పేర్కొన్నారు. గతంలో యూనియన్ అపిస్ బెరర్లుగా పనిచేసిన వారితో పాటు, పలువురు సీనియర్ సభ్యులకు ముందస్తు సమాచారం లేకుండా సభ్యత్వం లేకుండా తొలగించారని పిర్యాదు చేశారు.అయితే జిల్లా కలెక్టర్, కార్మిక శాఖ అధికారులకు పిర్యాదు చేసిన పాట్టించుకోకపోవడంతో యూనియన్ సభ్యుడు రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.. అలాగే తాజాగా జరిగిన ఎన్నికల్లో నూతనంగా గెలిచినా అధ్యక్షుడు యూనియన్ ప్రకారం ప్రాథమిక సభ్యత్వానికే అనర్హుడని, సంబధిత సాక్ష్యాలతో సహా హైకోర్టు లో కేసు దాఖలు చేశారు. రామకృష్ణారెడ్డి ఫిర్యాదును హైకోర్టు పరిగణనలోకి తీసుకొనీ జిల్లా కలెక్టర్, కరీంనగర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ శాఖకు వెంటనే అవకతవలపై విచారణ చేపట్టాలని ఉత్తర్వుల్లో ఆదేశాలు జారీచేశారు.

About The Author