ఎల్. ఆర్. ఎస్. దరఖాస్తుల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
లేఅవుట్ ప్లాట్ల క్రమబద్ధీకరణ కొరకు ప్రభుత్వం కల్పించిన ఎల్.ఆర్.ఎస్.-2020 లో వచ్చిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో మున్సిపల్ కమిషనర్లు, నీటిపారుదల శాఖ అధికారులతో ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తుల ప్రక్రియను ఫిబ్రవరి 20వ తేదీలోగా పూర్తి చేసే విధంగా అధికారులు పనులను వేగవంతం చేయాలని తెలిపారు. మున్సిపాలిటీల పరిధిలో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, వార్డుల నుంచి ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డులకు తరలించాలని, బయో మైనింగ్ నిర్వహణపై పలు సూచనలు చేశారు. లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలో 10 లక్షల రూపాయల నిధులతో కంపోస్ట్ షెడ్డు నిర్మాణ పనులు చేపట్టి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. రిసోర్స్ పర్సన్ సమన్వయంతో వార్డులలో పారిశుధ్య నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలని, తడి చెత్త, పొడి చెత్త లను వేరువేరుగా నిల్వచేసి అందించేలా వివరించాలని తెలిపారు. అన్ని వార్డులలో నిరంతరాయంగా ప్రతిరోజు త్రాగునీటి సరఫరా జరిగేలా పర్యవేక్షించాలని, వేసవికాలం సమీపిస్తున్నందున తాగునీటి సరఫరాపై ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. ప్రభుత్వ భూముల ఆక్రమణ, సరైన అనుమతులు లేని నిర్మాణాలపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, సరైన అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.