ఘనంగా మీనాక్షి నటరాజన్ జన్మదిన వేడుకలు
మణుగూరు, జూలై 23 (భారతశక్తి): పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ రేణుక చౌదరి క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గురిజాల గోపి బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా ఫైర్ బ్రాండ్ మాజీ కేంద్రమంత్రి రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి ముఖ్యఅనుచరులు గోపి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రతినిత్యం కృషి చేస్తున్న గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారని కొనియాడారు. రాజకీయ నైపుణ్యం, ముందస్తు ప్రణాళికలు, విశ్లేషణలు చేస్తూ అంతరగతంగా ఉన్న కలహాలను తొలగిస్తూ పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్న మహిళ మణి మీనాక్షి నటరాజన్ కు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రేణుక అక్షర మహిళా మండలి సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
06 Aug 2025