నేరాల నివారణకు క్షేత్ర స్థాయిలో నిఘా ఉంచాలి
ప్రజలకు అందుబాటులో ఉండాలి.... బాగా పని చేసేవారికి గుర్తింపు వస్తుంది.... అత్యవసర సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ.
సూర్యాపేట జిల్లా బ్యూరో (భారతశక్తి) జూలై23: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ పోలీసు అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీసు అధికారులు నేరాల నివారణలో సమిష్టిగా పని చేయాలని,క్షేత్ర స్థాయిలో నిఘా ఉంచాలని ఆదేశించారు.సమీక్షలో భాగంగా నేరాల నమోదు, పెండింగ్ కేసులు, కోర్టు మానిటరింగ్, శిక్షలు అమలు, డయల్ 100 కాల్స్,సిటిజన్ ఫీడ్ బ్యాక్ క్యూ ఆర్ కోడ్ పని తీరు, ఫిర్యాదుల పై స్పందన, వాహనాల తనిఖీ, అనుమానిత వ్యక్తుల కదలికలు, రౌడి షిటర్స్ పై నిఘా, రోడ్డు ప్రమాదాల నిర్మూలన,సైబర్ మోసాల్లో నగదు రిఫండ్, దొంగతనాల కేసుల్లో కేసుల డిటెక్షన్ మొదలగు అంశాలను సమీక్షించారు.
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ విజువల్ పోలీసింగ్ నిర్వహించాలని, పెట్రోలింగ్, బీట్స్ సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు భరోసా కల్పించాలని ఆదేశించారు. దుకాణ సముదాయల్లో కాలనీలలో గ్రామాల్లో రహదారుల వెంట సీసీ కెమెరాలు ఏర్పాటు కోసం ప్రజల్లో అవగాహన కల్పించాలని దీనిపై ఎక్కువగా దృష్టి సారించాలన్నారు. సైబర్ మోసాలపై మహిళా భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. వర్షసూచన ఉన్నప్పుడు అప్రమత్తంగా పని చేయాలి, వరదలు,నీటి ప్రవాహం అవకాశం ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, ఎరువుల అమ్మకాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలతో కలిసి మెలిసి ఉండాలని ప్రభుత్వ హాస్టల్ లాంటివి విజిట్ చేయాలని ఆదేశించారు.
సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ కు మెరిటోరియస్ సర్వీస్ రివార్డ్ అందించి అభినందనలు తెలిపిన ఎస్పీ.... గంజాయి స్వాధీనం,నకిలీ విత్తనాల స్వాధీనం కేసుల్లో బాగా పని చేసినందుకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్ ను బుధవారం సమీక్షా సమావేశం నందు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అభినందించారు.
ఈ మేరకు ఐజి కార్యాలయం నుండి వచ్చిన మెరిటోరియస్ సర్వీస్ రివార్డును సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్ కు అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఉత్తమంగా విధులు నిర్వర్తించే పోలీసు సిబ్బందికి అందెంచే రివార్డులలో మెరిటోరియస్ సర్వీస్ రివార్డ్ అత్యుత్తమైనదన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డి.ఎస్.పి ప్రసన్నకుమార్, డి సి ఆర్ బి ఇన్స్పెక్టర్ హరిబాబు,సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్,రంజిత్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ లు చరమంద రాజు, రజిత, శివ శంకర్, నాగేశ్వరరావు, రామకృష్ణా రెడ్డి, నరసింహారావు, ఎస్ ఐ లు, సిబ్బంది ఉన్నారు.