సీసీటీవీ ఆధునికీకరణ – నిర్మల్ కమాండ్ కంట్రోల్ కి అనుసంధానం.

సిబ్బంది ప్రజల రక్షణ కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి: జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల.

సీసీటీవీ ఆధునికీకరణ – నిర్మల్ కమాండ్ కంట్రోల్ కి అనుసంధానం.

భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, జూలై 19: నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం జిల్లా వ్యాప్తంగా ఉన్న సీసీటీవీ నెట్ వర్క్ ను మరింత బలోపేతం చేయడానికి జిల్లా ఎస్పీ డా: జి.జానకి షర్మిల ఐపిఎస్,పోలీసు సిబ్బంది తో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సీసీ కెమెరాలను సమగ్రంగా సేకరించి, కమాండ్ కంట్రోల్ వ్యవస్థకు అనుసంధానం చేయడం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా బ్లూ కోల్ట్‌లు, పెట్రో కార్లు, కమ్యూనిటీ కాంటాక్ట్ కెమెరాలు మరియ "నేను సైతం" ప్రోగ్రాం ద్వారా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సమాచారాన్ని ప్రతి పోలీస్ స్టేషన్ సిబ్బంది భౌతికంగా పరిశీలించి, 10 రోజుల్లోగా అప్‌డేట్ చేయనున్నారు,ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కెమెరాలకు నెట్‌వర్క్ (ఇంటర్నెట్ కనెక్షన్) ను అందుబాటులోకి తీసుకురానున్నారు.ఆలయాలు, మసీదులు,బస్టాండ్లు, ప్రభుత్వ ఆసుపత్రులు,మార్కెట్ ప్రాంతాలు, పాఠశాలలు,వంటి కీలక ప్రాంతాలను గుర్తించి, ఆ ప్రాంతాల్లో ఉన్న కెమెరాలను నిర్మల్ కమాండ్ కంట్రోల్ కి అనుసంధానం చేయడం జరుగుతుంది.

Read More రైతులకు అవసరమైన అన్ని ఎరువులను అందుబాటులో ఉంచాలి..

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా భద్రతా వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతుందని తెలిపారు. ప్రజల భద్రత, నేర నివారణ, పబ్లిక్ మానిటరింగ్‌ లో ఇది ఒక ముందడుగు అని పేర్కొన్నారు.
అంతే కాకుండా,బ్లూ కోల్ట్‌లు మరియు పెట్రో కారు సిబ్బంది ప్రజల రక్షణ కోసం నిరంతరం కార్యచరణలో ఉండటం అభినందనీయం అన్నారు. వారు చేస్తున్న సేవలు, సీసీ కెమెరాల ఆధునికీకరణ కార్యక్రమంలో వారి భాగస్వామ్యం చాలా కీలకమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ, సిబ్బందిని ఆదేశించారు.

Read More విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలి-

About The Author