ప్రజావాణి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలి

అదనపు కలెక్టర్- సీతారామారావు

సూర్యాపేట :

 

WhatsApp Image 2025-10-13 at 7.27.08 PM

Read More యథా విధిగా ప్రజావాణి కార్యక్రమం..

ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను  జిల్లా అధికారులు వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా   అదనపు కలెక్టర్  కే. సీతారామారావు  ఆదేశించారు.సోమవారం ఆయన కలెక్టరెట్ సమావేశ మందిరంలో  ప్రజవాణి లో పాల్గొని ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు  ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నా వాటి పై దృష్టి సారించి తక్షణం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 

Read More పోలియో రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి  

నేడు నిర్వహించిన ప్రజవాణి లో భూములకు సంబంధించి 20 ఫిర్యాదులు, డి పి ఓ కి 6,మున్సిపల్ కమిషనర్ లకి 6, స్త్రీ మరియు శిశు సంక్షేమ అధికారికి 4,  ఇతర అధికారులకు 21 ఫిర్యాదులు మొత్తం 57 ఫిర్యాదులు వచ్చాయని వీటన్నింటిని సంబంధిత శాఖల అధికారులకు పంపడం జరిగిందని, జాగ్రత్తగా అన్నిటిని పరిశీలించి  ఆలస్యం చేయకుండా వేగంగా పరిష్కరించెందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు.

Read More విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

డిఆర్ డి ఏ పి డి వి వి అప్పారావు, హోజింగ్ పి డి సిదార్ధ, డి ఎం హెచ్ ఓ చంద్రశేఖర్, డి సి ఓ పద్మ, డి ఇ ఓ అశోక్, డి ఏ ఓ శ్రీధర్ రెడ్డి, సంక్షేమ అధికారులు దయానంద రాణి, శంకర్, శ్రీనివాస్, నరసింహారావు , పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి,సూపర్టీడెంట్లు,అధికారులు, సిబ్బంది తదితరులు ప్రజావాణి కార్యక్రమానికి హాజరుయ్యారు

Read More నేటి భారతం :

About The Author