ప్రతి గ్రామీణ గృహానికి తాగునీరు అందించాలి..

మిషన్ డైరెక్టర్, అడిషనల్ సెక్రటరీ కమల్ కిషోర్ సోన్

WhatsApp Image 2025-08-07 at 6.34.21 PM 

సజల్‌జీవన్‌ మిషన్‌ పథకం ద్వారా ప్రతి గ్రామీణ గృహానికి తాగునీరు అందించాలని దాని  అమలుపై మిషన్ డైరెక్టర్, అడిషనల్ సెక్రటరీ కమల్ కిషోర్ సోన్ వీడియో కాన్ఫరెన్స్  ద్వారా ఆయా జిల్లా కలెక్టర్లతో నిర్వహించారు.

Read More పని చేసిన ఇబ్బందులకు గురిచేస్తున్నారు


ఈసందర్భంగా అయన మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి సురక్షిత మంచినీరు అందించాలనే సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జల్‌జీవన్‌ మిషన్‌ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నాయన్నారు. ఇందులో భాగంగా ఇంటింటికి కొళా యి కనెక్షన్‌ను ఇవ్వడం జరుగుతోందన్నారు. జల్‌జీవన్‌ మిషన్‌ లక్ష్యా న్ని నెరవేర్చేందుకు అనుబంధ శాఖలన్నీ సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు. ప్రతి గృహానికి మంచినీటి కొళాయిని ఏర్పాటు చేసి సురక్షిత మంచినీటిని అందించి తద్వారా ప్రజారోగ్య పరిరక్షణకు పాటుపడాలన్నారు. అలాగే నీరు వృథా కాకుండా సంరక్షించి భావితరాలకు నీటి కొరత లేకుం డా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గ్రామీణ నీటి మౌలిక సదుపాయాలలో ప్రణాళిక రూపకల్పన, అమలుకు ప్రజలను, కమ్యూనిటీలను సమీకరించి భాగస్వాములు చేయడంలో ఐఎ్‌సఏలు కీలక పాత్రపోషించాలన్నారు. ప్లంబింగ్‌, విద్యుదీకర ణ, నీటి నాణ్యత యాజమాన్యం, నీటి పరిశుద్ధీకరణ, నిర్మాణం, నిర్వహణలకు అవసరమైన నైపుణ్యాలను కలిగిన మానవ వనరులను మెరుగుపరచాలన్నారు. సురక్షిత మంచినీటి అవసరం, లబ్ధిదారుల భాగస్వామ్యం అంశాల గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. 
జల్‌ జీవన్‌ మిషన్‌ లక్ష్యాలను సకాలంలో అధిగమించడానికి ఐఎ్‌సఏ(ఇంప్లిమెంటేషన్‌ సపోర్ట్‌ ఎజేన్సీ)లు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సాధించాలన్నారు.  అన్ని గ్రామాల్లో గల సామాజిక భవనాలకు, పాఠశాలలకు, యతీ, అంగన్వాడీ భవనాలకు, ఆరోగ్య కేంద్రాలకు మొదటి ప్రాదాన్యత ఇచ్చి సురక్షిత మంచినీటి కుళాయిలను 100% పూర్తి చేయాలన్నారు. 
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, డిఆర్డిఓ శ్రీధర్, రూరల్ వాటర్ సప్లై ఎస్ ఇ రాములు, రాంకుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

Read More జర్నలిస్టుల సంక్షేమం కోసం టీయూడబ్ల్యూజే

About The Author