కామారెడ్డి మండలంలోని గర్గుల్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం తనిఖీ
ఆకస్మిక తనిఖీలు చేపట్టిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్..

కామారెడ్డి :
గురువారం కామారెడ్డి మండలంలోని గర్గుల్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలోని మౌలిక వసతులను, రోగులకు అందుతున్నటువంటి సేవలను గురించి ఆరా తీశారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర భవనానికి విద్యుత్ సరఫరా గురించి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే నీటి వసతి కల్పన గురించి కల్పించుట గురించి కావలసిన ఏర్పాట్లు చేయాలని గ్రామ కార్యదర్శిని, మండల పరిషత్ అభివృద్ధి అధికారిని ఆదేశించారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

About The Author
15 Nov 2025
