అల్ఫోర్స్ లో ఉత్కంఠ భరితంగా సీబీఎస్ఇ క్లస్టర్ 7 టేబుల్ టెన్నిస్ పోటలు

WhatsApp Image 2025-08-07 at 6.38.39 PM

క్రీడల ద్వారా విద్యార్థులకు గుర్తింపు లభిస్తుందని, విజయం సాధించడానికి ఆసక్తి పెంపొందించవచ్చని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి‌. నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం కొత్తపల్లి లోని అల్ఫోర్స్ హైస్కూల్ (సిబిఎస్ఇ) ప్రాంగణంలో నిర్వహిస్తున్నటువంటి టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ఉద్దేశించి మాట్లాడారు. ప్రారంభించినటువంటి టోర్నమెంట్ ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నదని తెలిపారు.   వివిధ పాఠశాల నుంచి విచ్చేసినటువంటి క్రీడాకారులు క్రీడా స్ఫూర్తి చాటుతూ క్రీడా రంగానికి వన్నెతెస్తున్నానని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని వారు తెలిపారు. ఈ క్రమంలో రెండో రోజులో భాగంగా నిర్వహించేటువంటి టీం ఈవెంట్లలో అండర్ 14 బాలికల విభాగంలో టీం ఈవెంట్లో విపిఎస్ పబ్లిక్ స్కూల్ టైం స్కూల్ పై ఒక పాయింట్ తేడాతో గెలిచింది. అండర్ 17  విభాగంలో శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ 3-0 పాయింట్ల తో సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ పై  గెలిచింది. అండర్ 19 విభాగంలో  శ్రీ ప్రకాష్ సీనర్జీ పాఠశాల సర్ సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్  పై 0-3 పాయింట్ల తేడాతో గెలిచింది.. 

Read More ముఖ గుర్తింపు హాజరు నమోదు శాతం పెంచాలి

About The Author