వరలక్ష్మీ వ్రత వేడుకలకు ముస్తాబైన శ్రీ మహాశక్తి ఆలయం..

ఉదయం  మహాహారతి, ప్రత్యేక పూజలు, సాయంత్రం వరలక్ష్మి వ్రతం 

 

WhatsApp Image 2025-08-06 at 5.06.54 PM

కరీంనగర్ : కరీంనగర్ పట్టణం చైతన్యపురిలోని అమ్మవార్లు శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి ల మహిమాన్విత దివ్య క్షేత్రం శ్రీ మహాశక్తి దేవాలయం వరలక్ష్మి వ్రత వేడుకలకు ముస్తాబైంది. శ్రీశ్రీశ్రీ  జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి ఆశీస్సులతో ఈనెల 7, 8 తేదీల్లో గురువారం, శుక్రవారం రోజున  శ్రీ మహాశక్తి దేవాలయంలో ప్రత్యేక ఫల పంచామృతాభిషేకం, మంగళద్రవ్యభిషేకం పూజలు, వరలక్ష్మి వ్రతం ను నిర్వహిస్తున్నారు. 7వ తేదీ గురువారం రోజున సాయంత్రం 7 గంటలకు శ్రీ గణపతి, శ్రీ మహాదుర్గా, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లకు ఫల పంచామృతాభిషేకం, మంగళద్రవ్యాభిషేకం జరుగుతుందని అలాగే 8వ తేదీ శ్రావణ శుక్రవారం - వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఉదయం 7.30 గంటలకు అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ, అనంతరం దూప దీపా నైవేద్యం, మహాహారతి, సాయంత్రం 6.30 గంటలకు వరలక్ష్మి వ్రతము, సామూహిక కుంకుమార్చన అనంతరం తీర్థ ప్రసాద వినియోగం చేపట్టనున్నారు. ఆలయాన్ని మొత్తం పూలతో, విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు. శ్రీ మహాశక్తి దేవాలయంలో వరలక్ష్మి వ్రతానికి ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా ఇక్కడి దేవాలయంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని భక్తులు అదృష్ట దేవతగా భావిస్తుంటారు. ఆలయంలో వరలక్ష్మి  వ్రతం చేపట్టిన మహిళలకు లక్ష్మీదేవి అనుగ్రహం, సకల సంపదలు, కుటుంబాల శ్రేయస్సు లభిస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా దేవాలయానికి తరలివచ్చే అశేష భక్తులను దృష్టిలో ఉంచుకొని ఆలయ నిర్వహకులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండతీవ్రత ఉన్నందున త్రాగునీరు, పెండల్స్, కూలర్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు. 7, 8 తేదీల్లో శ్రీ మహాశక్తి దేవాలయంలో జరిగే ప్రత్యేక పూజ కార్యక్రమాలు, వరలక్ష్మీ వ్రత వేడుకలకు సమస్త భక్తులు తరలివచ్చి అమ్మవార్ల అనుగ్రహం పొందగలరని  ఆలయ నిర్వాహకులు కోరారు.

Read More అభాగ్యులను, మతిస్థిమితం లేని వారిని గుర్తించాలి

About The Author