దేశంలో ఈసీ ఓట్ల దొంగతనం ప్రజాస్వామ్యానికి అవమానం..
కామారెడ్డి
డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు
కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కైలాస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఏడవ తారీఖున రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టి ఓట్ల దొంగతనం ఎలా జరిగిందో పటిష్టమైన ఆధారాలతో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఈసీ బీజేపీ రెండు ఒకటే అని నిరూపించారు. మోడీ ప్రధాని పీఠంపై దొడ్డి దారిన కూర్చున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ కళ్ళు తెరిచి ఓటరు జాబితాను నిష్పక్షపాతంగా వ్యవహరించి తప్పులను సరిదిద్ది ప్రజాస్వామ్యానికి క్షమాపణ చెప్పాలని, ఈసీకి ఎవరైనా తమ అనుమానాలను అడిగితే వారిని బెదిరించే ధోరణి మానుకోవాలని, బీహార్ ఎన్నికలు బ్యాలెట్ తో నిర్వహించి ఓటరు జాబితాను ప్రక్షాళన చేయాలని,దీంతో బిజెపి అసలు రంగు బయటపడుతుందని ఆయన అన్నారు.
Read More అలసత్వం వద్దు..
Read More నేటి భారతం
About The Author
12 Aug 2025