నేటి భారతం
భక్తి అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి..
మనసుతో ప్రార్ధన చేయడం దేవుడికి ఎంతో ప్రీతి..
భక్తి పేరుతో అరాచకం, ఉన్మాదం అవాంఛనీయం..
హంగు, ఆర్భాటాలు ఏ దేవుడూ కోరుకోడు..
ఎదుటి వారికి కష్టం, నష్టం కలిగించకపోవడమే నిజమైన భక్తి..
సహాయం చేయకపోయినా పర్వాలేదు..
ఎదుటివారికి అన్యాయం చేయకండి..
మీ భక్తి.. ఆనందం కలిగించాలి గానీ.. అనార్ధాలు తీసుకురావద్దు..
అందుకే అంటారు.. వీలైతే పాలు..
అవికూడా లేకపోతే నీళ్లు..
అదీ దొరక్కపోతే ఒక పుష్పం..
ఇవన్నీ లేకపోయినా భక్తితో ఒక నమష్కారం..
అది చాలు ఆ పరమేశ్వరుడి మనసు గెలవడానికి..
ఈ నిజం తెలుసుకుంటే మీలో ప్రతి ఒక్కరు ఒక కన్నప్ప అవుతాడు..
మీరో ఒక మహనీయుడు వెలుస్తాడు..
- బోయినపల్లి రమణా రావు, సీనియర్ జర్నలిస్ట్
Read More గీతం జాతీయ చర్చాగోష్ఠి ప్రారంభోత్సవం..
About The Author
06 Aug 2025