హైకోర్టు అడ్వకేట్-మారగాని శ్రీనివాస్ గౌడ్ కి ఉస్మానియా విశ్వవిద్యాలయ డాక్టరేట్.
తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ గా పని చేస్తున్న మారగాని శ్రీనివాస్ గౌడ్ కి ఉస్మానియా విశ్వవిద్యాలయం- డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో - "ఎ స్టడీ ఆన్ సర్వీస్ క్వాలిటీ అసెస్మెంట్ ఆఫ్ సెలెక్ట్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్" అనే అంశం పై పరిశోధనకు గాను ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ను ప్రధానం చేసింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణానికి చెందిన మారగాని రోశయ్య గౌడ్-నాగమ్మల కు జన్మించిన కుమారుడు శ్రీనివాస్ గౌడ్ హుజూర్ నగర్ పట్టణంలోని చైతన్య పాఠశాలలో 1 నుంచి 10 వ తరగతి వరకు విద్యను,ఇంటర్మీడియట్- సూర్యాపేటలో, డిగ్రీ మరియు పీజీ -హైదరాబాద్ నిజాం కళాశాలలో, ఉస్మానియా యూనివర్సిటీలో- ఎల్.ఎల్.బి ని పూర్తిచేసుకుని, ఉస్మానియా విశ్వవిద్యాలయం బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం- సీనియర్ ప్రొఫెసర్ పి వెంకటయ్య పర్యవేక్షణలో పీహెచ్ డి పూర్తి చేశారు. వీరి పరిశోధనకు గాను ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ను ప్రధానం చేసింది. గతంలో మారగాని శ్రీనివాస్ గౌడ్ ,మాజీ గవర్నర్ - ఈ ఎస్ ఎల్- నరసింహన్ చేతుల మీదుగా -తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం లోను- గోల్డ్ మెడల్ ను సాధించారు. ఈ సందర్భంగా డా.శ్రీనివాస్ సాధించిన విజయాలకు గాను ఉస్మానియా విశ్వవిద్యాలయ సీనియర్ ప్రొఫెసర్-పి వెంకటయ్య మరియు అధ్యాపక బృందం, పరిశోధక విద్యార్థులు, హుజూర్ నగర్ ప్రాంత వాసులు, మిత్రులు-అభినందనలు తెలియజేశారు.