నేటి భారతం

పొట్ట గడవక జీవనోపాథి కోసం కష్టపడి 
పని చేసేవారిని కార్మికులు అంటారు..
కానీ బాల్యంలోనే ఈ విధంగా పని చేసి 
ఆకలి తీర్చుకునే వారిని బాల కార్మికులు అంటారు.. 
చదువుకోవాల్సిన తరుణంలో తమ చిట్టి చిట్టి చేతులతో 
మోయలేని బరువైన పనులు చేస్తూ.. 
కర్మాగారాల్లో.. అనారోగ్యం కొనితెచ్చే పరిస్థితుల్లో 
బ్రతుకునీడుస్తున్న రేపటి పౌరులు అని 
పిలవబడుతున్న పసిమొగ్గల భవితవ్యం 
బుగ్గిపాలవుతోంది.. 

ఒక్కసారి ఆలోచించండి.. సంపన్నులు 
తమ పిల్లలకు కొనిచ్చే ఒక్క డ్రెస్ కు ఖర్చుపెట్టే డబ్బుతో పదిమంది 
పిల్లల కడుపు నిండుతుంది.. భూమ్మీద జన్మించిన ప్రతి ఒక్కరికీ 
బ్రతికే హక్కును కల్పించి మహనీయులు అవ్వండి.. 

Read More జర్నలిస్టుల సంక్షేమం కోసం టీయూడబ్ల్యూజే

- బోయినపల్లి రమణా రావు, సీనియర్ జర్నలిస్ట్WhatsApp Image 2025-08-08 at 4.47.42 PM (1)

Read More జాతికి సవాలు విసురుతున్న బాలకార్మిక వ్యవస్థ..

About The Author