మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం..
ప్రకృతి మన జీవితాలకోసం అద్భుతాలు చేస్తోంది..
- మనమేమో వాటిని కాలరాస్తున్నాం..
- ప్రకృతి ప్రకోపాన్ని చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నాం..
- పచ్చదనాన్ని పరిరక్షించడం కనీస బాధ్యగా మార్చుకోవాలి..
- ప్లాస్టిక్ రహిత సమాజాన్ని స్థాపించాలి..
- గాలి, నీరు, భూమి స్వచ్ఛంగా ఉంటేనే జీవనం సాగుతుంది..
- ఒకవైపు ప్రజలు కాలుష్యాన్ని నిర్లక్ష్యం చేయడం..
- రసాయనాలు వెదజల్లే పరిశ్రమలు మరోవైపు విషాన్ని వెదజల్లడం..
- సరైన అవగాహన కల్పించకపోతే ప్రపంచ వినాశనం జరుగుతుంది..
- ప్రకృతిని కాపాడే బాధ్యత అందరూ తీసుకోవాలని ఆశిస్తోంది "ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ"..
ప్రకృతి మనకు తల్లి ఒడి లాంటిది.. తల్లి ఒడిలో చల్లగా జీవించే స్వేచ్ఛ ఉంటుంది.. అలాంటి తల్లి ఒడిని నాశనం చేస్తే మనిషి మనుగడ ప్రమాదంలో పడుతుంది.. ఎంతో స్వచ్చంగా ఉన్న ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తున్న ధోరణి ప్రతి చోటా కనిపిస్తోంది.. మన ఇల్లు బావుంటే చాలు పక్కన వుండే వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అనుకునే స్వార్ధపరులున్నంత కాలం పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించదు.. ఈ స్వార్ధ ప్రవృత్తి ప్రతి ఒక్కరిలో చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.. ప్రకృతిని ప్రేమించడం నేర్చుకోకపోతే ప్రమాదంతో కలిసి ప్రాణం పోయేంతవరకు ప్రయాణం సాగించక తప్పదు...
భారతీయ సంస్కృతిలో అరటి, రావి, మర్రి, తులసి, మామిడి మొదలైన చెట్లను పూజిస్తారు.. మధ్యయుగపు, మొగలు పరిపాలన కాలపు భారతదేశంలో పర్యావరణంపై ప్రేమపూర్వక వాతావరణమే నెలకొని ఉండేది. ఆంగ్లేయులు తమ స్వార్థపూరిత ఆర్థిక ప్రయోజనాల కోసం భారతదేశంలో పర్యావరణాన్ని నాశనం చేయడం ప్రారంభించారు. వారి విధ్వంసకర విధానాలవల్ల భారతదేశంలో పర్యావరణం దెబ్బతింది.
అయితే భారత రాజ్యాంగం 1950లో అమలులోకి వచ్చింది. కానీ అందులో పూర్తి స్థాయిలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అధికరణలు జోడించబడలేదు.1972లో జరిగిన స్టాక్ హోమ్ సమ్మేళనం కారణంగా భారతదేశం పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించడం ఆరంభించింది. 1976లో జరిగిన రాజ్యాంగ సవరణలో అధికరణం 48ఏ, 51ఏ లను జోడించారు. కానీ అధికరణం 48 ఏ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణకు, వాటిలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాలి. అధికరణం 51ఏ/ 6 పౌరులు పర్యావరణ పరిరక్షణతోపాటు.. అభివృద్ధికి తోడ్పడుతూ వన్య జీవుల పట్ల సహానుభూతిని కలిగి ఉండాలని తెలుపుతుంది.
అయితే ప్రతి సంవత్సరంలో జూన్ 5 ఒక ప్రత్యేకత ఉంది..
జూన్ 5న విశ్వవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం జరుపుకుంటారు. దీన్ని పురస్కరించుకొని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పర్యావరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ జాగృతపరిచే ప్రయత్నాలు చేస్తుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి 1972లో ప్రారంభించింది. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రపంచ సమ్మేళనం ఒకటి నిర్వహించింది. అన్ని దేశాలను ఆహ్వానించింది. స్వీడన్ లో నిర్వహించిన ఈ సమ్మేళనంలో సుమారు 119 దేశాలు పాల్గొన్నాయి. ప్రతి సంవత్సరం జూన్ 5న ఈ సమ్మేళనం జరుగుతుంది.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యానికి ముఖ్య కారణాలు ఒకసారి పరిశీలిస్తే : జల కాలుష్యం, వాయు కాలుష్యం, భూ కాలుష్యం.. కాలుష్య నియంత్రణకు ఆర్ఎస్ఎస్ ఎంతో ప్రయత్నంక చేసింది.. పెరుగుతున్న జనాభా, తరుగుతున్న ఉత్పాదకత మానవ జాతి మనుగడకే ప్రమాదం. దీని ప్రభావం పర్యావరణంపై పడుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 10 మార్చి 2019 లో జరిగిన ప్రతినిధుల సభలో ఒక నిర్ణయం తీసుకుంది. సంఘం పర్యావరణ పరిరక్షణ సంకల్పాన్ని ప్రారంభించింది. స్వయంసేవకులు తమ తమ స్థాయిలో క్షేత్రాల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రయత్నిస్తూనే సమాజాన్ని జాగృతం చేస్తారు. నిర్ధిష్టమైన పద్ధతిలో కార్యక్రమాలు కూడా చేపడతారు. సంఘ్ దేశవ్యాప్తంగా విభిన్నమైన గతివిధుల సహకారంతో పనులు చేపడుతోంది.
2018 సంవత్సరంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 15 ఆగస్టు నుండి 22 ఆగస్టు వరకు చేపట్టిన ఒక అభియాన్ ద్వారా దేశ రాజధాని ఢిల్లీలో 10 లక్షలకు పైగా మొక్కలు నాటారు. పరిసరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యంగా నీడనిచ్చే, ఔషధ గుణాలున్న మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం ఢిల్లీ లోని ప్రతి ప్రాంతంలో చేపట్టారు. దీనిలో స్థానిక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ లు, సామాజిక సంస్థలు, ప్రముఖ వ్యక్తులు, విద్యాలయాలు, ఇతర శిక్షణా సంస్థలను భాగస్వాములు చేశారు. స్థానికంగా ప్రజల సహకారంతో పర్యావరణ కమిటీలు ఏర్పాటు చేసి నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత అప్పగించారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా దేశవ్యాప్తంగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించే ఉద్యమాన్ని 2016 జూన్ 20న ప్రారంభించింది. పట్టణాలలో పెరుగుతున్న కాలుష్యానికి దృష్టిలో ఉంచుకొని ఐదు వేల కంటే ఎక్కువ మొక్కలు నాటడానికి సంకల్పించారు. ఈ కార్యక్రమంలో సమాజంలోని ప్రజలను భాగస్వాములను చేయాలని ప్రయత్నిస్తూ 93 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో సంఘ్ జీవనాన్ని ప్రసాదించే మాతృ స్వరూపంగా ప్రకృతిని భావిస్తూ, ఆ ప్రకృతిని రక్షించే బాధ్యతను పోషించడం కర్తవ్యంగా భావిస్తోంది.
అయితే ఏ ఒక్క సంస్థో పర్యావరణ పరిరక్షణకు నాడు కడితే సరిపోదు.. అందరూ ఇందులో భాగస్వామ్యం కావాలి.. తల్లి ఒడి లాంటి ప్రకృతిని తగలబెట్టకుండా కాపాడుకోవాలి.. నిర్లక్ష్యం వహిస్తే ఎంతో ప్రమాదం.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు సంభవిస్తున్న విపత్తులను ఒకసారి గమనించాలి.. ఒక దేశం, ఒకప్రాంతం అని కాకుండా ఇది భూమండలమంతా వ్యాపించిన జాడ్యం.. దీనిని అరికట్టకపోతే ప్రపంచం స్మశానంగా మారిపోతుంది.. పర్యావరణ పరిరక్షణకు " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " నడుం కట్టింది.. మీ అందరి భాగస్వామ్యాన్ని ఆశిస్తోంది..