అభాగ్యులను, మతిస్థిమితం లేని వారిని గుర్తించాలి

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి


WhatsApp Image 2025-08-06 at 5.10.43 PMకరీంనగర్ : కార్పొరేషన్ పరిధిలో రోడ్లు, ప్రధాన కూడళ్ల వద్ద ఉండే అనాథలు,అభాగ్యులు, మతి స్థిమితం లేని, కుటుంబ సభ్యులకు దూరమైన వారిని గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారులను కలెక్టర్ పమేలా సత్పతి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లోని ఎన్జీవోలకు అప్పగించాలని పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని నగరపాలిక కార్యాలయంలో కమిషనర్ ప్రపుల్ దేశాయ్, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే, పోలీస్ ఇతర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అలాంటి వ్యక్తుల నుంచి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా రాత్రిళ్ళు రోడ్లపై తిరగకుండా వారికి తాత్కాలికంగా వసతి ఏర్పాటు చేయాలన్నారు. కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి అప్పగించాలన్నారు. అనాథలను వారికి అండగా నిలిచే ఎన్జీవోలకు అప్పగించి బాగోగులు చూడాలని సూచించారు. 

ఈ సమావేశంలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ సతీష్, సీఐ రవీందర్, మెప్మా పీడీ వేణుమాధవ్ రెడ్డి, డీడబ్ల్యుఓ కార్యాలయ సిబ్బంది, వీబీ ఫౌండేషన్ నిర్వాహకులు వీరమాధవ్  తదితరులు పాల్గొన్నారు.

Read More మీరు భయపడ్డారా.. అంతే సంగతులు...

About The Author