కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు 


WhatsApp Image 2025-08-06 at 3.25.03 PM
కామారెడ్డి :ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా  బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ సమాజం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప త్యాగశీలి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని అన్నారు. అన్ని రంగాలలో వెనుకబడిన తెలంగాణ సమాజాన్ని  చైతన్య పరిచేందుకు  ఆచార్య జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. ముఖ్యంగా ఉన్నత విద్యావంతుడైన  ఆయన తెలంగాణ సమాజానికి జరుగుతున్న అన్యాయాలను  చూసి చెలించి అన్ని దశల తెలంగాణ ఉద్యమాలలో క్రియాశీలకంగా పాల్గొని తన రచనలు, ప్రసంగాల ద్వారా తెలంగాణ సమాజాన్ని తట్టి లేపి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమానికి  ఊపిరి పోశారన్నారు. కాకతీయ యూనివర్సిటీ  వైస్ ఛాన్స్ లర్ గా వేలాదిమంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి మార్గదర్శక నిలిచారని  ఆయన అడుగుజాడల్లో తెలంగాణ సమాజ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని అన్నారు.

Read More ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించండి

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, కలెక్టరేట్ ఏవో, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, టీఎన్జీవో, టీజీవో  నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Read More పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

About The Author