జర్నలిస్టుల సంక్షేమం కోసం టీయూడబ్ల్యూజే
జిల్లా టియుడబ్ల్యూజే,టెంజు కమిటీల నియామకం.
తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమ ధ్యేయంగా టియుడబ్ల్యూజే పని చేస్తుందని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు,జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా అన్నారు.సిరిసిల్ల పట్టణంలో శుక్రవారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టియుడబ్ల్యూజే హెచ్ 143, ఎలక్ట్రానిక్ మీడియా (టెంజు) నూతన కమిటీలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టుల సమాజం హక్కులు సాధన, సంక్షేమం కోసం కలిసికట్టుగా కృషి చేద్దామన్నారు నూతనంగా నియమించబడ్డ కార్యవర్గం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.సంఘం రాష్ట్ర అధ్యక్షులు,మాజీ ప్రెస్ అకాడమీ అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ ల ఆధ్వర్యంలో కొనసాగుతున్న సంఘ బలోపేతం కోసం సభ్యుల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. సీనియర్ పాత్రికేయులు రాపల్లి సంతోష్ కుమార్,ఎలక్ట్రానిక్ మీడియా టెoజూ అధ్యక్షులు ఇరుకుల ప్రవీణ్ కుమార్,ప్రధాన కార్యదర్శి సామల గట్టు, కోశాధికారులు అందే దేవేందర్, సయ్యద్ కలీంల సమక్షంలో పూర్తిస్థాయి కమిటీలను ప్రకటించారు.అధ్యక్షులుగా లాయక్ పాషా ఆంధ్రప్రభ స్టాఫ్ రిపోర్టర్, ప్రధాన కార్యదర్శి సామల గట్టు నమస్తే తెలంగాణ,కోశాధికారి అందే దేవేందర్ సాక్షి,ఉపాధ్యక్షులు గా రేగుల రాము వార్త,జలగం అనిల్ రావు సూర్య,బొల్లం పరుశురాం బలగం,సంయుక్త కార్యదర్శులుగా గుర్రాల మోహన్, నమస్తే తెలంగాణ,కార్యనిర్వాహక కార్యదర్శులు గా షేక్ రియాజ్ ప్రజాపోరు,లింగారెడ్డి గారి శేఖర్ రెడ్డి,నమస్తే తెలంగాణ,సంయుక్త కార్య దర్శులు బండారి బాలరాజు నమస్తే తెలంగాణ,బాబ్జి,నమస్తే తెలంగాణ,బైరి బాలరాజు నమస్తే తెలంగాణ,కార్యవర్గ సభ్యులు గా
గడ్డం తిరుపతి మన తెలంగాణ, అరిగే రమేష్ ఆంధ్రప్రభ,కూర సంతోష్ నవ తెలంగాణ,పంజా సంపత్ కుమార్ తెలంగాణ రిపోర్టర్,సుంచు బాబు జనం సాక్షి ,తుమ్మనపల్లి నరేందర్ ఆంధ్రప్రభ,రాజూరి విష్ణుదిశా, మల్యాల ప్రసాద్ ఆంధ్రప్రభ,ఎల్లాల నర్సారెడ్డి తెలంగాణ పత్రిక,సంఘం గౌరవ సలహాదారులుగా రాపల్లి సంతోష్ కుమార్ నమస్తే తెలంగాణ,నిమ్మ బాలచందర్ రెడ్డి సాక్షి,ఆసరి మహేష్ సాక్షి జిల్లా క్రైమ్ స్టాఫర్ లతోపాటు న్యాయ సలహాదారుడుగా గొట్టే కిరణ్ కుమార్ లను నియమించినట్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా ప్రకటించారు.
టెంజు జిల్లా కమిటీ అద్యక్షుడు ఇరుకుల్ల ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షుడు చల్లా ప్రసాద్ రెడ్డి , మహమ్మద్ ఇస్స్మత్, ప్రధానకార్యదర్శి ఎం.డి. అజీం, కోశాధికారి యస్.డి. కలీం , కార్యనిర్వాహక కార్యదర్శి దారం కృష్ణ ,సంయుక్త కార్యదర్శి కోడం గంగాధర్,ప్రచార కార్యదర్శి గా బత్తిని శ్రీధర్, కార్యవర్గ సభ్యులుగా మహమ్మద్ సలావుద్దీన్, నక్క రాజు, యాకూబ్, బిట్ల గణేష్, బరిగెల రమేష్, బ్రాహ్మణపల్లి సాయికిరణ్, మామిడిశెట్టి దినేష్ కత్తి రాజు లను ప్రకటించారు.