రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలకు సోలార్ పవర్ ప్లాంట్లు..
విద్యుత్ శాఖపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వీడియో కాన్ఫరెన్స్
కరీంనగర్ :
గ్రామపంచాయతీ బిల్డింగ్ మొదలుకొని సెక్రటేరియట్ వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటుచేసి పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన వివరాలకు సంబంధించి కలెక్టర్లు హైదరాబాద్ కు పంపాల్సిన వివరాలకు సంబంధించి ఒక ప్రశ్నావళిని పంపిస్తున్నాం అందులో అన్ని వివరాలు నమోదు చేసి వారం లోపు విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కార్యాలయానికి పంపాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.
ప్రభుత్వ భవనాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు , ఉన్నత విద్యాసంస్థల భవనాలపై కూడా సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయాలని అందుకు సంబంధించిన భవనాల వివరాలు పంపాలని కలెక్టర్లను ఆదేశించారు.
నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖ పరిధిలో పెద్ద ఎత్తున ఖాళీ స్థలాలు ఉన్నాయి వాటి వివరాలు సైతం పంపాలని కలెక్టర్లకు డిప్యూటీ సీఎం సూచించారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్ ఓ ఎఫ్ ఆర్ చట్టం కింద 6.70 లక్షల ఎకరాల భూములను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసింది ఈ భూముల్లో నల్లమల డిక్లరేషన్ కింద ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ద్వారా ఉచితంగా సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయనున్నట్టు డిప్యూటీ సీఎం కలెక్టర్లకు వివరించారు. నల్లమల డిక్లరేషన్ లో భాగంగా ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గం లో ప్రారంభించాం ఈ నెలలోనే ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కలెక్టర్లు ఎక్కడ అలసత్వం ప్రదర్శించకుండా వారంలోగా వివరాలు పంపండి, ఈ విషయాల్లో ఎలాంటి సందేహాలు ఉన్న విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఎస్పీడీసీఎల్, సీఎండీలు ని సంప్రదించాలని డిప్యూటీ సీఎం కలెక్టర్లను ఆదేశించారు.
కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఇతర అధికారులు పాల్గొన్నారు.