భైంసా సబ్ కలెక్టర్‌గా అజ్మీరా సాంకేత్ కుమార్ బాధ్యతలు స్వీకరణ.

WhatsApp Image 2025-08-07 at 3.33.48 PM

నిర్మల్ జిల్లా భైంసా :
నిర్మల్ జిల్లా భైంసా సబ్ కలెక్టర్‌గా అజ్మీరా సాంకేత్ కుమార్ గురువారం ఉదయం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నుండి బయలుదేరిన ఆయన మార్గ మధ్యంలో బాసర శ్రీ జ్ఞానసరస్వతి దేవస్థానాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత భైంసా సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆర్డీవో కోమల్ రెడ్డి ఆయనకు అధికారికంగా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, సర్ఫరాజ్ అహ్మద్, ఇతర మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలతో ఘనంగా స్వాగతం పలికారు.

బాధ్యతల స్వీకరణ అనంతరం ఆర్డీవో కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బందితో సమావేశమై, వారికి సంబంధించిన సెక్షన్ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా నియోజకవర్గ పరిధిలోని వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కూడా ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి, భవిష్యత్ పరిపాలనలో అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తానని సబ్ కలెక్టర్ అజ్మీరా సాంకేత్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భైంసా తహసీల్దార్ ప్రవీణ్ కుమార్. ఆర్డీవో కోమల్ రెడ్డి. కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

About The Author