10 కోట్ల విలువైన పబ్లిక్ స్థలాలు స్వాహా..
జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్ కాపాడేనా..!
- జిహెచ్ఎంసి ఎల్బీనగర్ జోన్ లో నిర్వీర్యమైన మున్సిపల్ వ్యవస్థ..!
- అడ్డగోలుగా డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేసిన ఎల్బీనగర్ సబ్ రిజిస్టార్ జ్యోతి..!
- తప్పుడు రిజల్యూషన్ సృష్టించి ప్లాట్ల విక్రయం..
- విశ్వేశ్వరాయ ఇంజనీర్స్ కో-ఆపరేటివ్ హోసింగ్ లో వెలుగు చూసిన అక్రమ ఘటన..
- సొసైటీ సెక్రెటరీ కే. రవీందర్ రెడ్డి చేసిన అవినీతి నిర్వాకం..
- ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న సొసైటీ సభ్యులు..
- ఈమేరకు జీ.హెచ్.ఎం.సి. జోనల్ కమిషనర్ కి ఫిర్యాదు..
- అయితే ఇప్పటికే ఈ సొసైటీ రద్దు కాబడినది..
- రద్దైన సొసైటీకి ఇంకా సెక్రెటరీగా చెప్పుకుంటూ అక్రమాలు..
హైదరాబాద్ :నివాస స్థలాలకు, గృహనిర్మాలకోసం అందరూ ఏకమై ఒక సొసైటీని సృష్టించుకున్నారు.. సదరు సొసైటీ రిజిస్టర్ కూడా చేసుకున్నారు.. కానీ కొన్ని అనివార్య కారణాల వలన సొసైటీ రద్దు కాబడింది.. అయిననూ రద్దైన ఆ సొసైటీకి ఇంకా సెక్రటరీ అని చెప్పుకుంటున్న ఒక వ్యక్తి సొసైటీకి సంబంధించిన ప్లాట్లను అక్రమ పద్దతిలో ఇతరులకు విక్రయిస్తున్న సంఘటన వెలుగు చూసింది.. ఆ వివరాలు ఒకసారి చూద్దాం.. కాగా ఇదే విషయమై సొసైటీ కి సంబంధించిన సభ్యులు ఈ అక్రమ విక్రయాల వివరాలను పొందుపరుస్తూ జె.హెచ్.ఎం.సి. జోనల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.. ఆయన చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్. వి. కర్ణన్ ఈ అక్రమ వ్యవహారంపై దృష్టిచారించాలని కోరుచున్నారు..
సంబంధిత డాక్యుమెంట్స్ నెంబర్స్ ఈ విధంగా ఉన్నాయి..
4775/2025, 4774/2025, 4760/2025, 4762/2025, 4765/2025, 4777/2005, 4754/2025..
కర్మన్ ఘాట్ సర్వే నెంబర్ 59లో విశ్వేశ్వర ఇంజనీర్స్ కాలనీలో ప్లాట్ నెంబర్ 398, 399,400,401,402,403, ఈ ఫ్లాట్ల మొత్తం 2000 గజాలు విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్ హౌసింగ్ సొసైటీపై ఉన్నాయి.. కానీ అక్రమంగా హౌసింగ్ సొసైటీ మాదే అని ఒక ఫేక్ రెజల్యూషన్ ద్వారా కొందరు వ్యక్తులతో కుమ్మక్కై వారి పేరుమీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది.. కాగా విశ్వేశ్వరాయ ఇంజనీర్స్ కాలనీ సంక్షేమ సభ్యులు జిల్లా కలెక్టర్ కి హౌసింగ్ సొసైటీ వారికి సంబంధిత వ్యక్తిపై ఫిర్యాదు చేయడం జరిగింది.. ఇట్టి హౌసింగ్ సొసైటీ గత 40 సంవత్సరాల నుంచి ఎటువంటి కార్యక్రమాలను, లావాదేవీలను జరపడం లేదు. అప్పుడున్న సభ్యులకు సంబంధం లేకుండా ఒకే వ్యక్తి ఫేక్ రెజల్యూషన్ తనకై తానే సొంతంగా తయారు చేసుకొని తనకు అధికారం ఉంది అని కొందరు వ్యక్తులతో కుమ్మక్కయి.. ప్లాట్లను 30 మే 2025 నాడు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది.. అయితే ఇట్టి అంశంపై సబ్ రిజిస్టర్ కి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది.. ఈ విషయంపై ఎల్బీనగర్ సబ్ రిజిస్టర్ జ్యోతిని ప్రశ్నిస్తే ఆమె దురుసుగా సమాధానం చెప్పడం ఆమె అవినీతికి అద్దం పడుతుంది.. భారీ మొత్తంలో డబ్బులు తీసుకొని అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేసినట్టు అవగతం అవుతుంది.. సామాన్యుడు చిన్న ఇల్లు రిజిస్ట్రేషన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే సవాలక్ష తప్పులు చూపించి రిజిస్ట్రేషన్లు చేయకుండా ఆపి ఇబ్బందులకు గురి చేసే సబ్ రిజిస్ట్రార్ ఇంత తతంగం జరుగుతున్నా..10 కోట్ల రూపాయల ప్రజా భూములను ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సొసైటీ కి సంబంధిత సభ్యులు ఈ అంశంపై జిల్లా కలెక్టర్ కి అదే విధంగా హౌసింగ్ సొసైటీ వారికి ఫిర్యాదు చేసి, సంబంధిత న్యాయస్థానంలో కూడా న్యాయ పోరాటం చేయడానికి పూనుకున్నారు.. కావున ఈ సంబంధిత ప్లాట్లకు ఎటువంటి నిర్మాణ అనుమతులను మంజూరు చేయకూడదని సభ్యులు మనవి చేస్తున్నారు.. జిహెచ్ఎంసి కమిషనర్ ప్రత్యేక దృష్టిసారించి తమకు ఉపయోగ స్థలాన్ని తమకు ఇప్పించాలని ఆవేదనతో వేడుకుంటున్నారు..
సదరు సొసైటీ రద్దుఅయినప్పటికి కె. రవీందర్ రెడ్డి అనే వ్యక్తి 2021వ సంవత్సరములో తప్పుడు రిజల్యూషన్ తయారుచేసి, సదరు రిజల్యూషన్ లో కె. రవీందర్ రెడ్డి కి సదరు సొసైటీకి సంబంధించిన ప్లాట్లను విక్రయించుటకు అధికారము ఇచ్చినట్లు పేర్కొని, సదరు సొసైటీకి సంబంధించిన 07 (ఏడు) పాట్లు, ప్లాటు నెంబర్లు: 398 నుండి 404, సుమారు 2,000 చదరపు గజములను విక్రయించి వారి పేర్లపై రిజిస్ట్రేషన్ చేసి, కొనుగోలుదారులనుండి పైకము తీసుకొనివున్నారు..
కావున జోనల్ కమిషనర్ ఈ విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి, తగిన విచారణ జరిపించి.. కె. రవీందర్ రెడ్డి పై చట్టరీత్యా చర్యతీసుకొని, సదరు కె. రవీందర్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్లను రద్దు చేయాలని సభ్యులు ఇప్పటికే మనవి చేసి ఉన్నారు.. కానీ ఇప్పటికీ ఎలాంటి చర్యలు చేప్పట్టబడలేదు..
కాగా 1982వ సంవత్సరములో విశ్వేశ్వరాయ ఇంజనీర్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెట్ కె. రవీందర్ రెడ్డి, తండ్రి : కె. పురుషోత్తం రెడ్డి సెక్రటరీగా వ్యవహరిస్తూ, మిగిలిన సభ్యులతో 1982వ సం.లో టి.బి. నెంబరు: 313 దాఖలా ప్రారంభించి తదుపరి సదరు సొసైటి రద్దుకాబడినది. ఇది గమనించగలరని వారు విజ్ఞప్తి చేశారు..