అర్జీల పరిష్కారానికి జవాబుదారిగా పనిచేయాలి: జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి

వైయస్సార్ జిల్లా,ఫిబ్రవరి 14(భారత శక్తి ): రెవెన్యూ సమస్యలపై వచ్చిన అర్జీల పరిష్కారానికి పూర్తి బాధ్యతాయుతంగా, జవాబుదారితనంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని సభా భవన్ లో బద్వేల్,కడప రెవెన్యూ డివిజన్ల పరిధిలోని రెవెన్యూ అధికారులకు రెవెన్యూ అంశాలు వివిధ చట్టాలపై ఒకరోజు శిక్షణా కార్యక్రమం(వర్క్ షాప్) జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డి.ఆర్.ఓ విశ్వేశ్వర నాయుడు,తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ జిల్లాలో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారిక వేదికలో 80% పైగా రెవెన్యూ సమస్యల పైనే వస్తున్నాయని అన్నారు. ఇందుకు సంబంధించి కడప బద్వేలు ఆర్డిఓ రెవిన్యూ డివిజన్లో పరిధిలోని సర్వేయర్లు, వీఆర్వోలు డిప్యూటీ తహసిల్దారులు, తహసిల్దార్లకు రెవెన్యూ అంశాలకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఆయా మండలాల పరిధిలో తహసీల్దారులు కూడా కార్యాలయ సిబ్బందితో రెవెన్యూ సమస్యలపై వర్క్ షాప్ నిర్వహించుకోవాలని సూచించారు. ముఖ్యంగా మండలాల్లో ఆయా గ్రామాలకు సంబంధించి వచ్చిన అర్జీలు అన్నింటినీ పరిశీలించి ఏ అంశాలకు సంబంధించిన అర్జీలు వచ్చాయో క్రోడీకరించుకోవాలని సూచించారు. అలాగే పిజిఆర్ఎస్, రెవెన్యూ సదస్సులు, రీసర్వే లో వచ్చిన అర్జీలను పరిశీలించి డూప్లికేట్ అర్జీలు లేకుండా చూసుకోవాలన్నారు. అర్జీలను నిశితంగా పరిశీలించి సమస్యను అర్థం చేసుకొని అనాలసిస్ చేసి నాణ్యతతో పరిష్కరించాలన్నారు. గ్రామస్థాయిలో గుర్తించిన అర్జీలను పరిష్కరించడానికి నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఆయా గ్రామాల్లో రెవెన్యూ అధికారులు వారంలో నాలుగు రోజులు విజిట్ చేసి పూర్తి అవగాహనతో పరిష్కరించాలన్నారు. రెవిన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ ఎంక్వయిరీలు నిర్వహించేటప్పుడు సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో కలసి పనిచేయాలన్నారు.జిల్లా కలెక్టరేట్ నుంచి ప్రతి ఒక్క మండల స్థాయి అధికారులపై మోనిటరింగ్ ఉంటుందని పేర్కొన్నారు.అలాగే ప్రభుత్వ భూముల ఆక్రమించుకునే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు రెవెన్యూ అధికారులు అసైన్డ్ భూములు, ఆర్ ఓ ఆర్, పట్టాదారు పాస్ పుస్తకాలు,చట్టాలు తదితర అంశాలపై పూర్తి అవగాహన కలిగి పని చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి నుంచి రెవెన్యూ సదస్సులు, పిజిఆర్ఎస్, రీ సర్వే, గ్రామసభలు ఫ్రీ హోల్డ్ భూములపై మోనిటరింగ్ చేస్తున్నారని అందుకు అనుగుణంగా జిల్లాలోని రెవెన్యూ సిబ్బంది నిబద్ధతతో పని చేయాలన్నారు. ఆయా మండలాలు గ్రామాల స్థాయిలోనే అర్జీలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు కమలాపురం తహసిల్దార్ శివరామిరెడ్డి రెవెన్యూ చట్టాలపై, పిపిటి ప్రజెంటేషన్ ద్వారా రెవెన్యూ అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో కడప ఆర్డీవో జాన్ ఇర్విన్,బద్వేల్ ఆర్డీవో చంద్ర మోహన్, కడప, బద్వేల్ డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు,డిప్యూటీ తహశీల్దార్లు, సర్వేయర్లు,వీఆర్వో లు,తదితర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

అర్జీల పరిష్కారానికి జవాబుదారిగా పనిచేయాలి: జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి

వైయస్సార్ జిల్లా,ఫిబ్రవరి 14(భారత శక్తి ): రెవెన్యూ సమస్యలపై వచ్చిన అర్జీల పరిష్కారానికి పూర్తి బాధ్యతాయుతంగా, జవాబుదారితనంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని సభా భవన్ లో బద్వేల్,కడప రెవెన్యూ డివిజన్ల పరిధిలోని రెవెన్యూ అధికారులకు రెవెన్యూ అంశాలు వివిధ చట్టాలపై ఒకరోజు శిక్షణా కార్యక్రమం(వర్క్ షాప్) జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డి.ఆర్.ఓ విశ్వేశ్వర నాయుడు,తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ జిల్లాలో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారిక వేదికలో 80% పైగా రెవెన్యూ సమస్యల పైనే వస్తున్నాయని అన్నారు. ఇందుకు సంబంధించి కడప బద్వేలు ఆర్డిఓ రెవిన్యూ డివిజన్లో పరిధిలోని సర్వేయర్లు, వీఆర్వోలు డిప్యూటీ తహసిల్దారులు, తహసిల్దార్లకు రెవెన్యూ అంశాలకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఆయా మండలాల పరిధిలో తహసీల్దారులు కూడా కార్యాలయ సిబ్బందితో రెవెన్యూ సమస్యలపై వర్క్ షాప్ నిర్వహించుకోవాలని సూచించారు. ముఖ్యంగా మండలాల్లో ఆయా గ్రామాలకు సంబంధించి వచ్చిన అర్జీలు అన్నింటినీ పరిశీలించి ఏ అంశాలకు సంబంధించిన అర్జీలు వచ్చాయో క్రోడీకరించుకోవాలని సూచించారు. అలాగే పిజిఆర్ఎస్, రెవెన్యూ సదస్సులు, రీసర్వే లో వచ్చిన అర్జీలను పరిశీలించి డూప్లికేట్ అర్జీలు లేకుండా చూసుకోవాలన్నారు. అర్జీలను నిశితంగా పరిశీలించి సమస్యను అర్థం చేసుకొని అనాలసిస్ చేసి నాణ్యతతో పరిష్కరించాలన్నారు. గ్రామస్థాయిలో గుర్తించిన అర్జీలను పరిష్కరించడానికి నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఆయా గ్రామాల్లో రెవెన్యూ అధికారులు వారంలో నాలుగు రోజులు విజిట్ చేసి పూర్తి అవగాహనతో పరిష్కరించాలన్నారు. రెవిన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ ఎంక్వయిరీలు నిర్వహించేటప్పుడు సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో కలసి పనిచేయాలన్నారు.జిల్లా కలెక్టరేట్ నుంచి ప్రతి ఒక్క మండల స్థాయి అధికారులపై మోనిటరింగ్ ఉంటుందని పేర్కొన్నారు.అలాగే ప్రభుత్వ భూముల ఆక్రమించుకునే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు రెవెన్యూ అధికారులు అసైన్డ్ భూములు, ఆర్ ఓ ఆర్, పట్టాదారు పాస్ పుస్తకాలు,చట్టాలు తదితర అంశాలపై పూర్తి అవగాహన కలిగి పని చేయాలన్నారు.

జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి నుంచి రెవెన్యూ సదస్సులు, పిజిఆర్ఎస్, రీ సర్వే, గ్రామసభలు ఫ్రీ హోల్డ్ భూములపై మోనిటరింగ్ చేస్తున్నారని అందుకు అనుగుణంగా జిల్లాలోని రెవెన్యూ సిబ్బంది నిబద్ధతతో పని చేయాలన్నారు. ఆయా మండలాలు గ్రామాల స్థాయిలోనే అర్జీలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.

అంతకుముందు కమలాపురం తహసిల్దార్ శివరామిరెడ్డి రెవెన్యూ చట్టాలపై, పిపిటి ప్రజెంటేషన్ ద్వారా రెవెన్యూ అధికారులకు వివరించారు.

ఈ సమావేశంలో కడప ఆర్డీవో జాన్ ఇర్విన్,బద్వేల్ ఆర్డీవో చంద్ర మోహన్, కడప, బద్వేల్ డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు,డిప్యూటీ తహశీల్దార్లు, సర్వేయర్లు,వీఆర్వో లు,తదితర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

About The Author