ఎస్సీ ఉమెన్స్ క్యాంపస్ హాస్టల్ వార్డెన్ ని సస్పెండ్ చేయాలి జిల్లా కలెక్టర్ కు SFI నాయకుల వినతి
కరీంనగర్, (భారత శక్తి) ఎస్సీ ఉమెన్స్ కళాశాల హాస్టల్ వార్డెన్ ని వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ వినతిపత్రం అందజేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో దరఖాస్తు చేసిన అనంతరం శ్రీకాంత్ మాటడుతూ జిల్లకేంద్రంలోని ముఖరంపుర లోగల ఉమెన్స్ కళాశాలలో నీ ఎస్సీ కళాశాల క్యాంపస్ హాస్టల్ వార్డెన్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నిబంధనలు పాటించకుండా విద్యార్థులకు సరిపడా భోజనం పెట్టకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. ప్రతిరోజు విద్యార్థినిలకు సరిపడా కూర వండకపోవడం వలన చివరిగా వస్తున్న విద్యార్థినిలకు దాదాపు పది మందికి కూడా సరిపోవడం లేదన్నారు. అదేవిధంగా బాత్రూంలకి డోర్లు లేక అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారని, కనీసం పట్టించుకోవడం లేదనీ, ఫ్యాన్లు చెడిపోయి దాదాపు పది రోజులు గడుస్తున్నా, వాటికి మరమత్తులు చేయడం లేదనీ చెప్పారు. పైగా మాకు ఇబ్బంది అవుతుంది మేడం అని విద్యార్థినిలు అడుగుతే కింద హాల్లోకి వచ్చి పడుకోండి అని చెబుతున్న పరిస్థితి నెలకొందన్నారు. అమ్మాయిలకు ప్రతిరోజు మెనూ ప్రకారం వచ్చే అరటి పండ్లు కూడా సరిగా ఇవ్వడం లేదని, ఉదయం టిఫిన్ లో ప్రతి హాస్టల్ లో సాంబారు పెడితే కేవలం ఈ ఒక్క హాస్టల్లో మాత్రం చారు పెడుతున్న పరిస్థితి ఉందన్నారు. ఇలా అమ్మాయిలను అనేక ఇబ్బందులు పెడుతున్న వార్డెన్ ను పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట నగర కార్యదర్శి అసంపెళ్లి వినయ్ సాగర్ , సందేశ్ తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్, (భారత శక్తి)
ఎస్సీ ఉమెన్స్ కళాశాల హాస్టల్ వార్డెన్ ని వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ వినతిపత్రం అందజేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో దరఖాస్తు చేసిన అనంతరం శ్రీకాంత్ మాటడుతూ జిల్లకేంద్రంలోని ముఖరంపుర లోగల ఉమెన్స్ కళాశాలలో నీ ఎస్సీ కళాశాల క్యాంపస్ హాస్టల్ వార్డెన్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నిబంధనలు పాటించకుండా విద్యార్థులకు సరిపడా భోజనం పెట్టకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. ప్రతిరోజు విద్యార్థినిలకు సరిపడా కూర వండకపోవడం వలన చివరిగా వస్తున్న విద్యార్థినిలకు దాదాపు పది మందికి కూడా సరిపోవడం లేదన్నారు. అదేవిధంగా బాత్రూంలకి డోర్లు లేక అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారని, కనీసం పట్టించుకోవడం లేదనీ, ఫ్యాన్లు చెడిపోయి దాదాపు పది రోజులు గడుస్తున్నా, వాటికి మరమత్తులు చేయడం లేదనీ చెప్పారు. పైగా మాకు ఇబ్బంది అవుతుంది మేడం అని విద్యార్థినిలు అడుగుతే కింద హాల్లోకి వచ్చి పడుకోండి అని చెబుతున్న పరిస్థితి నెలకొందన్నారు. అమ్మాయిలకు ప్రతిరోజు మెనూ ప్రకారం వచ్చే అరటి పండ్లు కూడా సరిగా ఇవ్వడం లేదని, ఉదయం టిఫిన్ లో ప్రతి హాస్టల్ లో సాంబారు పెడితే కేవలం ఈ ఒక్క హాస్టల్లో మాత్రం చారు పెడుతున్న పరిస్థితి ఉందన్నారు. ఇలా అమ్మాయిలను అనేక ఇబ్బందులు పెడుతున్న వార్డెన్ ను పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట నగర కార్యదర్శి అసంపెళ్లి వినయ్ సాగర్ , సందేశ్ తదితరులు పాల్గొన్నారు.
