శ్రీ భూమి బ్యాంకెట్ హాల్ ను మూసివేయాలి : సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి
కరీంనగర్, ఫిబ్రవరి 6(భారత శక్తి): కరీంనగర్ నగరంలోని పదవ డివిజన్ పరిధిలో గల శ్రీ భూమి బ్యాంకెట్ హాల్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, పంక్షన్ అయితే చాలు రోడ్డుపై వందలాది వాహనాలు నిలపడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు ఆరోపించారు. గురువారం ఆయన ఒక ప్రకటనలో శ్రీ భూమి బ్యాంకేట్ హాలుతో హనుమాన్ నగర్, గణేష్ నగర్, తిరుమల్ నగర్, బాలాజీ నగర్, కోతి రాంపూర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే మున్సిపల్, ట్రాఫిక్ పోలీసులు బ్యాంకెట్ హాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వశక్తి కాలేజ నుండి పోచమ్మ టెంపుల్ వెళ్ళు బైపాస్ రోడ్డులో ఉన్న ఈ బ్యాంకెట్ హాల్ కు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉండవలసిన ఫైర్ సేఫ్టీ, పార్కింగ్ స్థలము లేదని, బ్యాంకెట్ హాల్ పూర్తిగా ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కిన మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై వాహనం పెడితే ఫోటో కొట్టి చాలన్లు వేసే ట్రాఫిక్ పోలీసులకు బ్యాంకెట్ హాలు ముందు రోడ్డుపై వందలవాహనాలు కనిపించకపోవడం విచిత్రంగా ఉందనీ విమర్శించారు. ఫంక్షన్ అయితే ఈ రహదారి నుండి వెళ్లాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోడ్డును ఆక్రమించి రోడ్డు వెంట కార్లు, మోటార్ సైకిల్ లు నిలిపి వేస్తున్నారని మండిపడ్డారు. ఫంక్షన్ల ల కోసం బుక్ చేసుకుంటే లక్షల రూపాయలు వసూలు చేస్తున్న బ్యాంకెట్ హాల్, ఫంక్షన్ హాల్ యజమానులు కనీస వసతులు కల్పించకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ నగరంలో బ్యాంకెట్ హాలు,ఫంక్షన్ హాల్స్ కి చాలా వాటికి పార్కింగ్ స్థలాలు, కనీస వసతులు, ఫైర్ సేఫ్టీ లేవని ఏదైనా ప్రమాదం జరిగితే ఎంత నష్టం జరుగుతుందో ఊహించలేమని వెంటనే పార్కింగ్ స్థలాలు లేని, ప్రభుత్వ నిబంధనలు పాటించని కోరారు. ఇప్పటికైనా వాటిని గుర్తించి మున్సిపల్ కమిషనర్ సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
కరీంనగర్, ఫిబ్రవరి 6(భారత శక్తి):
కరీంనగర్ నగరంలోని పదవ డివిజన్ పరిధిలో గల శ్రీ భూమి బ్యాంకెట్ హాల్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, పంక్షన్ అయితే చాలు రోడ్డుపై వందలాది వాహనాలు నిలపడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు ఆరోపించారు. గురువారం ఆయన ఒక ప్రకటనలో శ్రీ భూమి బ్యాంకేట్ హాలుతో హనుమాన్ నగర్, గణేష్ నగర్, తిరుమల్ నగర్, బాలాజీ నగర్, కోతి రాంపూర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే మున్సిపల్, ట్రాఫిక్ పోలీసులు బ్యాంకెట్ హాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వశక్తి కాలేజ నుండి పోచమ్మ టెంపుల్ వెళ్ళు బైపాస్ రోడ్డులో ఉన్న ఈ బ్యాంకెట్ హాల్ కు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉండవలసిన ఫైర్ సేఫ్టీ, పార్కింగ్ స్థలము లేదని, బ్యాంకెట్ హాల్ పూర్తిగా ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కిన మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్డుపై వాహనం పెడితే ఫోటో కొట్టి చాలన్లు వేసే ట్రాఫిక్ పోలీసులకు బ్యాంకెట్ హాలు ముందు రోడ్డుపై వందలవాహనాలు కనిపించకపోవడం విచిత్రంగా ఉందనీ విమర్శించారు.
ఫంక్షన్ అయితే ఈ రహదారి నుండి వెళ్లాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోడ్డును ఆక్రమించి రోడ్డు వెంట కార్లు, మోటార్ సైకిల్ లు నిలిపి వేస్తున్నారని మండిపడ్డారు.
ఫంక్షన్ల ల కోసం బుక్ చేసుకుంటే లక్షల రూపాయలు వసూలు చేస్తున్న బ్యాంకెట్ హాల్, ఫంక్షన్ హాల్ యజమానులు కనీస వసతులు కల్పించకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ నగరంలో బ్యాంకెట్ హాలు,ఫంక్షన్ హాల్స్ కి చాలా వాటికి పార్కింగ్ స్థలాలు, కనీస వసతులు, ఫైర్ సేఫ్టీ లేవని ఏదైనా ప్రమాదం జరిగితే ఎంత నష్టం జరుగుతుందో ఊహించలేమని వెంటనే పార్కింగ్ స్థలాలు లేని, ప్రభుత్వ నిబంధనలు పాటించని కోరారు. ఇప్పటికైనా వాటిని గుర్తించి మున్సిపల్ కమిషనర్ సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
