రైతుల సంక్షేమమే ధ్యేయం

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి 

రైతుల సంక్షేమమే ధ్యేయం

సూర్యాపేట జిల్లా బ్యూరో(భారత శక్తి) జూలై 23: సూర్యాపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కోసం డైరెక్టర్లతో పలు అంశాలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు.ఈ సందర్భంగా వచ్చే సీజన్ లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఈ కమిటీ పని చేస్తుందని చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు.

ఈ సమావేశంలో ఉన్నత శ్రేణి కార్యదర్శి ఫసియోద్దీన్(ముక్రం), మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ధారవత్ వీరన్న నాయక్, ఆర్తి కేశవులు, చెన్నోజు నర్సింహ చారి, నకిరేకంటి బాలకృష్ణ, పచ్చిపాల వెంకన్న, అబ్దుల్ కరీం, మాడ్గుల నవీన్, ఉప్పల సత్యనారాయణ, గోపగాని పెద్ద వెంకన్న, దాసరి తిరుమలరావు, గోగుల పద్మ సత్తిరెడ్డి, యూడిసీ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.

Read More ఆటో కార్మిక సోదరులకు అండగా ఉండి నా వంతు సహాయ సహకారాలు అందిస్తా.

About The Author