రాళ్ళవాగు ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

రాళ్ళవాగు ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ములుగు జిల్లా ప్రతినిధి,జులై 23 (భారత శక్తి) : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని రాళ్ళవాగును జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ పరిశీలించి జిల్లా, మండల స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉంటూ సమన్వయంతో పనిచేసి ఏటువంటి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

బుదవారం ములుగు జిల్లా వెంకటాపురం మండల యాకన్న గూడెం రాళ్ళ వాగు  ములుగు, భద్రాద్రి కొత్తగూడెం  జిల్లా సరిహద్దు  మరమ్మతులకు గురైన వంతెనను కలెక్టర్ దివాకర   టి.ఎస్. పరిశీలించారు.

Read More వసతి గృహాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి.. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎగువ కురిసిన అధిక వర్షాలతో   రాళ్లవాగు సమీపంలో తాత్కాలికంగా నిర్మించిన రహదారి వరద నీటి ప్రవాహంతో కొట్టుకుపోయిందని, ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిందని తెలిపారు. వచ్చే  మూడు రోజులలో అధిక వర్షాలు పడే అవకాశం ఉందని ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని  వాగులు, వంకలు, చెరువులు,గోదావరి ఉగ్ర రూపం దాల్చి ప్రవహించే అవకాశం ఉందని  వరద నీరు చేరి రోడ్లు పై వచ్చినప్పుడు ప్రజలు, వాహనాదారులు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అయితే తప్ప బయట కు రావద్దని, గోదావరి ముంపు ప్రాంతాలలో  ఉన్న ప్రజల సౌకర్యార్థం పునరవస కేంద్రం ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారుల ను ఆదేశించారు. 

Read More మద్నూర్ మండలంలో ఆకస్మికంగా పర్యటించిన జిల్లా కలెక్టర్..

వర్షాల ప్రభావంతో పురాతన కాలం నాటి  శిథిలావస్థకు చేరీన ఇళ్లల్లో ఉంటున్న వారిని పునరావస కేంద్రాలకు తరలించాలనీ అవసరమైన బోటు రెస్క్యూ టీమ్ సిద్ధం గా ఏటూరు నాగారం అందు బాటులో ఉన్నదని, గర్భిణి స్త్రీలు స్థానిక ఆసుపత్రి తరలించాలనీ  వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ , దోమల మందు పిచికారి చేయాలనీ గ్రామపంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, జిల్లా 
మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి ఏటువంటి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సంజీవ రావు, మండల అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Read More కామ్రేడ్ పూనం లింగన్న పోరాట స్ఫూర్తితో ఉద్యమాలను ఉదృతం చేస్తాం..

About The Author