సంగారెడ్డి లో ఐటి 2.0 తపాలా సేవలను ప్రారంభించిన పోస్టల్ ఎస్పీ శ్రీహరి
సంగారెడ్డి, భారత శక్తి ప్రతినిధి, జూలై 22: సంగారెడ్డి జిల్లా కేంద్రమైన సంగారెడ్డి ప్రధాన తపాలా కార్యాలయం లో అధునాతనమైన నూతన తపాలా పరిజ్ఞానం ఐటి 2.0 సేవలను సంగారెడ్డి డివిజనల్ పోస్టల్ ఎస్పీ శ్రీహరి మంగళవారం నాడు ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వనలతో నూతన సేవలకు శ్రీకారం చుట్టారు .
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మెరుగైన సేవలను తపాలా శాఖ ఖాతాదారులకు అందించడమే పోస్టల్ శాఖ ముఖ్య ఉద్దేశం అని తెలిపారు .డిజిటల్ సేవలను అందిపుచ్చుకొని వాటిని ఖాతాదారుల ముంగిట్లోకి చేరవేయడమే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తపాలా శాఖ ఎప్పటికప్పుడు మారుతూ సులభతరమైన సేవలను ఖాతాదాలకు అందిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మార్కెట్లో అతి తక్కువ ధరకు సేవలను అందించే ఏకైక డిపార్ట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ అని కొనియాడారు. అనంతరం స్వయంగా తానే ఒక మనీ ఆర్డర్ ను బుక్ చేసి క్యూఆర్ ద్వారా నగదును చెల్లించి కౌంటర్లో రసీదును తీసుకున్నారు. పోస్ట్ ఆఫీస్ ను అందంగా అలంకరించిన తపాల సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ సావిత్రి, హెడ్ క్వార్టర్ ఏఎస్పి రఘువీర్, పోస్ట్మాస్టర్ సాయిలు, తపాల సిబ్బంది నాగరాజు ,శ్రీనివాస్ గౌడ్,పరమేశ్వర్ ,రమేష్ ,మొయినుద్దీన్ ,నిషిత ,స్వీటీ ,కీర్తి ,ప్రవీణ్ కుమార్, ప్రణయ సిద్ధార్థ ,వనజ ,ప్రశాంత్, డి.శ్రీనివాస్ , శంకర్,నరేష్, విష్ణు, స్వాతి, ఉమాకాంత్, కుషలయ్య తదితరులు పాల్గొన్నారు.