సామాన్యులకు నీరు లేదు, ప్రభుత్వ ఉద్యోగులు పన్నులు కట్టకపోయినా నీళ్లు ఆగే పరిస్థితులు లేవు.
సూర్యాపేట జిల్లా బ్యూరో (భారతశక్తి) ఫిబ్రవరి 10: హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో గత 14 సంవత్సరాలుగా నీటి పన్ను చెల్లించని ఒక ప్రభుత్వ పంచాయితీ ఉద్యోగి నుండి పన్ను బకాయి వసూలు చేయలేక 10 రోజులుగా ఆ వీధిలోని ప్రజలందరికి నీటి సరఫరాను నిలిపి వేసిన ఘటన పుర ప్రజలను విస్మయానికి గురిచేసింది.ప్రభుత్వ నియమ,నిబంధనలకు తుంగలో తొక్కుతూ మున్సిపల్ అధికారులు ఇష్టారీతిగా వ్యవహరిస్తూ పన్నులు చెల్లిస్తున్న తమకు 10 రోజులుగా నీటి సరఫరాను బంద్ చేసిన మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగ సిబ్బంది 14 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగి నుండి నీటి పన్ను బకాయి ఎందుకు వసూలు చేయలేదని వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.14 సంవత్సరాల నుండి నీటి పన్ను చెల్లించని ఉద్యోగి ఇంట్లో మిషన్ భగీరథ పైప్ లైన్ల ద్వారా నీటి సరఫరా చేస్తూన్న మున్సిపాలిటీ సిబ్బంది పన్నులు చెల్లిస్తున్న తమకు నీటి సరఫరాను ఎలా ఆపుతారని గత 10 రోజులుగా నీళ్లులేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నమని కాలనీ ప్రజలు మండిపడ్డారు.ఈ విషయమై మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగం ఏఈ వినోద్ కుమార్ వివరణ అడగగా తనకు తెలియదంటూ నిర్లక్ష్యంగా సమాధానమివ్వడం గమనార్హం. ప్రత్యేక అధికారి పాలనలోనూ మున్సిపల్ అధికారుల వైఖరి మారకపోవడం శోచనీయమని మున్సిపాలిటీ కార్యాలయంలో ఇంటి పన్నులు, నీటి పన్నుల వసూళ్ల రికార్డులు, బిల్లుల చెల్లింపులకు సంబంధించిన దస్త్రాలను విజిలెన్స్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తే, తమ అధికారం అడ్డుపెట్టుకొని మున్సిపల్ అధికారులు అడ్డగోలుగా చేసిన అక్రమాలు వెలుగులోకి వస్తాయని, ప్రత్యేక అధికారుల పాలనలోనూ మారని మున్సిపల్ అధికారుల తీరుపై పుర ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారు.
సూర్యాపేట జిల్లా బ్యూరో (భారతశక్తి) ఫిబ్రవరి 10:
హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో గత 14 సంవత్సరాలుగా నీటి పన్ను చెల్లించని ఒక ప్రభుత్వ పంచాయితీ ఉద్యోగి నుండి పన్ను బకాయి వసూలు చేయలేక 10 రోజులుగా ఆ వీధిలోని ప్రజలందరికి నీటి సరఫరాను నిలిపి వేసిన ఘటన పుర ప్రజలను విస్మయానికి గురిచేసింది.ప్రభుత్వ నియమ,నిబంధనలకు తుంగలో తొక్కుతూ మున్సిపల్ అధికారులు ఇష్టారీతిగా వ్యవహరిస్తూ పన్నులు చెల్లిస్తున్న తమకు 10 రోజులుగా నీటి సరఫరాను బంద్ చేసిన మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగ సిబ్బంది 14 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగి నుండి నీటి పన్ను బకాయి ఎందుకు వసూలు చేయలేదని వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.14 సంవత్సరాల నుండి నీటి పన్ను చెల్లించని ఉద్యోగి ఇంట్లో మిషన్ భగీరథ పైప్ లైన్ల ద్వారా నీటి సరఫరా చేస్తూన్న మున్సిపాలిటీ సిబ్బంది పన్నులు చెల్లిస్తున్న తమకు నీటి సరఫరాను ఎలా ఆపుతారని గత 10 రోజులుగా నీళ్లులేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నమని కాలనీ ప్రజలు మండిపడ్డారు.ఈ విషయమై మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగం ఏఈ వినోద్ కుమార్ వివరణ అడగగా తనకు తెలియదంటూ నిర్లక్ష్యంగా సమాధానమివ్వడం గమనార్హం.
ప్రత్యేక అధికారి పాలనలోనూ మున్సిపల్ అధికారుల వైఖరి మారకపోవడం శోచనీయమని మున్సిపాలిటీ కార్యాలయంలో ఇంటి పన్నులు, నీటి పన్నుల వసూళ్ల రికార్డులు, బిల్లుల చెల్లింపులకు సంబంధించిన దస్త్రాలను విజిలెన్స్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తే, తమ అధికారం అడ్డుపెట్టుకొని మున్సిపల్ అధికారులు అడ్డగోలుగా చేసిన అక్రమాలు వెలుగులోకి వస్తాయని, ప్రత్యేక అధికారుల పాలనలోనూ మారని మున్సిపల్ అధికారుల తీరుపై పుర ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారు.
