మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ట్రయిల్ రన్ ఈనెల 24 న నిర్వహించాలి
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- నేషనల్ హైవే ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు మార్పు చేయాలి
- వెలుగుమట్ల అర్బన్ పార్కు లో సాగునీటి పైప్ లైన్ వేయాలి
- ఖమ్మం నగరంలో రహదారుల విస్తరణ చేపట్టాలి.
- ఇళ్ళు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి
ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ), జూలై 21:
రఘునాధపాలెం మండలంలోని చెరువులన్నింటిని ఈనెల 24వ తేదీ న ట్రయల్ రన్ వేసి చెరువులు నీటితో నింపే లా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న పనులన్నీటిని సత్వరమే పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద సబ్ స్టేషన్ నిర్మాణం కోసం యన్.పి.డి.సి.యల్ సిఎండి వరుణ్ రెడ్డి తో మాట్లాడి తక్షణమే టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు. ఇరిగేషన్ అడ్వైజర్ శ్రీ పెంటా రెడ్డి గారితో మాట్లాడి ఈనెల 24వ తారీఖున ట్రయిల్ రన్ నిర్వహించాలని ఆదేశించారు. అదేవిధంగా ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే పై కోడుమూరు గ్రామం వద్ద ఉన్న హై టెన్షన్ లైన్ ను తక్షణమే మార్చేలా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో డైరెక్టర్ లతా వినోదకు సూచించారు. నేషనల్ హైవే మరియు ట్రాన్స్కో అధికారులు సమన్వయం చేసుకొని పనులు పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
ఇదిలా ఉండగా వెలుగుమట్ల అర్బన్ పార్క్ లో వన్యప్రాణులకు త్రాగు నీరు మరియు నర్సరీ మొక్కలకు నీటిని అందించేందుకు కొదమూరు లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి వెలుగుమట్ల అర్బన్ పార్క్ వరకు పైప్ లైన్లు వేసేలా చర్యలు తీసుకోవాలని. ఆ డిజైన్లను డీఎఫ్ఓ తో సమన్వయం చేసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచనలు చేశారు. ఖమ్మం నగర సుందరీకరణ కోసం రహదారులను విస్తరించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వ్యవసాయ మార్కెట్ యార్డు చుట్టూ రహదారుల విస్తరణను వ్యక్తిగతంగా పరిశీలించి ఎవరినైనా గృహాలు కోల్పోతే వారికి డబల్ బెడ్రూం ఇల్లులు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ కేటాయించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు అదేవిధంగా మాస్టర్ ప్లాన్ ను సత్వరమే ఆమోదం పొందేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరినారు.