మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యం

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

  • కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ దృఢ సంకల్పం
  • కుల, మత, రాజకీయాలకతీతంగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు

మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యం

ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ), జూలై 18:
మహిళల ఆర్థిక సాధికారతే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని, ఏ దిశగా దృఢ సంకల్పం తో ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంత్రి కూసుమంచి మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ ఆవరణలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లతో కలిసి పాలేరు నియోజకవర్గం స్థాయి ఇందిరా మహిళా శక్తి సంబరాలలో పాల్గొని వడ్డీ లేని రుణాల చెక్కులు, లోన్ భీమా, ప్రమాద భీమా చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పాలేరు నియోజకవర్గంతో తల్లికి కొడుకుకి ఉన్న అవినాభావ సంబంధం నాకు ఉందన్నారు. మీ దీవెనలతో 18 నెలల క్రితం ఇక్కడి నుంచి కనివివి ఎరుగని మెజారిటీ తో నన్ను గెలిపించారన్నారు. రావణాసుర పరిపాలన వద్దు అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ 2023 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కి అధికారం కట్టబెట్టారన్నారు.

పేదోడికి భరోసా ఇవ్వడంలో ఆనాటి ప్రభుత్వం విఫలమైందని, కానీ పేదవాడి పక్షపాతిగా ఈ 18 నెలల నుంచి ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి అన్నారు. పేదవాడి పక్షపాతిగా ఎలా నడుచుకుంటున్నమో చెప్పడానికే రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలను నిర్వహిస్తుందని తెలిపారు. ఆనాటి ప్రభుత్వం బెల్ట్ షాపులు పెట్టి ప్రోత్సహిస్తే, మీరు ఎంచుకున్న ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతీ ఒక్కరికి రేషన్ కార్డులను ఇచ్చిందని మంత్రి అన్నారు. రెండు రోజుల క్రితమే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తుంగతుర్తిలో ప్రారంభించుకున్నామన్నారు. 5 లక్షల 65 వేల కొత్త రేషన్ కార్డులను ఈ ప్రభుత్వం ఇస్తుందని, 16 లక్షల మంది పేర్లు రేషన్ కార్డుల్లో చేర్పులు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆనాటి ప్రభుత్వం పదేళ్ళలో 90 వేల ఇండ్లు మంజూరు చేసి, 60 వేల ఇండ్లు మాత్రమే పూర్తి చేసిందని, మిగతా 30 వేలు మొండి గోడలతో అసంపూర్తిగా ఉన్నాయని అన్నారు. అంటే సగటున గడిచిన పదేళ్లలో ఆనాటి ప్రభుత్వం హయంలో ఏడాదికి కేవలం 6 వేల ఇళ్లు మాత్రమే పేదలకు ఇచ్చారన్నారు. ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో మొదటి విడతలోనే ఒక్కో నియోజకవర్గానికి 3500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఇంకా రాబోవు మూడు విడతల్లోనూ అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, ఎవరూ కూడా ఇల్లు రాలేదని ఆభద్రతకు లోను కావొద్దన్నారు. పాలేరు నా ఇల్లు ప్రతీ ఒకరికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాదని మంత్రి అన్నారు.

Read More రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన హోంగార్డు కు 15 లక్షల భీమా చెక్కు అందజేసిన పోలీస్ కమిషనర్.

కులం, మతం, పార్టీలకు అతీతంగా పేదవాడు ఐతే చాలు ఇందిరమ్మ ఇళ్లు, సంక్షేమ పథకాలను అందించే బాధ్యత తనదని తెలిపారు. గత ప్రభుత్వం రైతుని రాజు చేస్తామని చెప్పి పదేళ్లలో కేవలం రూ.17 వేల కోట్ల రుణ మాఫీ చేస్తే, ఇందిరమ్మ ప్రభుత్వం కేవలం 10 నెలల్లోనే 20 వేల కోట్లకు పైగా రైతు రుణమాఫీ చేసి చూపిందన్నారు. రైతు భరోసా ను ఎకరాకు 10 వేల నుండి 12 వేలకు పెంచి, 9 రోజుల్లోనే 9 వేల కోట్లను రైతు ఖాతాల్లో జమ చేసిందన్నారు. సన్నాలకు మద్దతు ధర తోపాటు, 500 రూపాయల బోనస్ ఇచ్చి రైతును రాజు చేసింది. నిరుద్యోగ యువతకు అన్న మాట ప్రకారం 50 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు. రాబోయే కొద్ది కాలంలోనే మరిన్ని ఉద్యోగాలు ఇస్తామని, కేవలం రెండేళ్ల లోనే లక్ష ఉద్యోగాలు ఇస్తామని, ఇలా దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం, చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వలేదని మంత్రి తెలిపారు.

Read More రైతులకు అవసరమైన అన్ని ఎరువులను అందుబాటులో ఉంచాలి..

హాస్టల్ లలో మెస్ ఛార్జీలు 40 శాతం, కాస్మొటిక్ ఛార్జీలు 200 శాతం పెంచి, పిల్లలకు మంచి ఆహారం అందిస్తున్నామన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500 లకే వంట గ్యాస్ సిలండర్, రాజీవ్ ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు మన ప్రభుత్వం పెంచిందన్నారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మన ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ధాన్యం కొనుగోలు, ఆర్టీసీ అద్దె బస్సుల బాధ్యత నిర్వహణ కూడా మహిళా సంఘాలకు ఇవ్వాలన్నదే మన ప్రభుత్వం ధ్యేయమని తెలిపారు. మహిళా సంఘాల నుంచే ఆడబిడ్డలు ఇందిరమ్మ ఇళ్లు కట్టు కోవడానికి రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, పాలేరు నియోజకవర్గంలోని 4585 మహిళా సంఘాలకు 5 కోట్ల 62 లక్షల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు. గత సంవత్సరం మొదలైన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం అంచెలంచెలుగా ఎదిగి, ఎన్నో విజయాలు సాధించిందన్నారు. అద్దె ఆర్టీసీ బస్సులు, ఇసుక రీచ్ ల నిర్వహణ, స్త్రీ టీ, షీ రాక్స్ కేంద్రాలు ఎన్నో ఏర్పాటయి, మహిళలు ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడి, ఆర్థిక సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. 

Read More ఆధునిక పరిజ్ఞానముతో వీణా కంటి హాస్పిటల్లో నేత్ర వైద్య పరీక్షలు..

రుణాలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ 14 జూలై న సీఎం తుంగతుర్తి లో ప్రారంభించారన్నారు. జిల్లాలో 19 వేల 400 పై చిలుకు కొత్త కార్డులు ఇస్తున్నామన్నారు. కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి మనిషికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ప్రతి నెల అందిస్తున్నామన్నారు. అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, సంక్షేమ గురుకులాల్లోనూ పిల్లలకు సన్న బియ్యంతో భోజనం అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గంలోని 4585 స్వయం సహాయక సంఘాల సభ్యులకు 5 కోట్ల 62 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను, లోన్ భీమా క్రింద 56 మంది సభ్యులకు గాను రూ. 44.90 లక్షల చెక్కును సభ్యుల సంఘాలకు, ప్రమాద భీమా క్రింద 5 గురు సభ్యుల నామినీ ఖాతాల్లో 10 లక్షల చొప్పున 50 లక్షలు అందజేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీవో ఎన్. సన్యాసయ్య, డిఎం సివిల్ సప్లయీస్ శ్రీలత, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, నియోజకవర్గ తహసీల్దార్లు, ఎంపిడివో లు, , మండల సమాఖ్య సభ్యులు, ఏ.పి.ఎం.లు, మహిళలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Read More శ్రీ సంతోషిమాత దేవాలయంలో ఘనంగా నాగ పంచమి పూజలు..

About The Author