మహిళలను మనుషులుగా చూడండి..
స్త్రీలు గృహహింస నిరోదక చట్టం 2005 గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి..
- స్త్రీని దేవతగా పూజించే దేశం మనది..
- ఆదిపరాశక్తి అంటాం.. అది నుంచి ఆమెకు కష్టాలే..
- ఎన్ని చట్టాలు వచ్చినా ఆడది అబలగానే మిగిలిపోతోంది..
- గృహ హింసే కాదు సమాజంలో కూడా అసమానతలే..
- ఒక ప్రాణికి జన్మనిచ్చి, తమ ప్రాణాలను ఫణంగా పెడుతుంది..
- ఆలయాన వెలసిన ఆదేవుని రీతి అని చెప్పుకుంటాం అంతే..
- స్త్రీ శక్తి లేకపోతే ఈ ప్రపంచం శూన్యం అవుతుంది..
- ప్రతి స్త్రీతోనూ తల్లిని, చెల్లిని, సోదరిని చూద్దాం..
- ఆడుకునే బొమ్మలా కాకుండా ఆదుకునే అమ్మలా గౌరవిద్దాం..
- ఆకాశమే హద్దుగా మహిళ ఇప్పుడు సాగిపోతోంది..
- ఆమెను రక్షించుకుందాం.. మనల్ని మనం కాపాడుకుందాం..
" ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ " సంస్థ అందిస్తున్న ప్రత్యేక కథనం..
స్త్రీ లేకుండా ఈ ప్రపంచ మనుగడ సాధ్యం కాదు.. వినా స్త్రీ యా జననం నాస్తి.. వినా స్త్రీ యా గమనం నాస్తి.. వినా స్త్రీ యా జీవం నాస్తి.. వినా స్త్రీ యా సృష్టి యేవ నాస్తి.. అని గొప్పగా చెప్పుకుంటాం.. కానీ ఎంతవరకు స్త్రీలను గౌరవిస్తున్నాం.. గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు కనీసం ఒక మనిషిగా చూస్తున్నామా..? ఎవరికీ వారు తమలో తాము ఈ ప్రశ్నను వేసుకోవాలి.. సమాధానం రాబట్టుకోవాలి.. ఈ భూమ్మీద అత్యంత సహనశీలి మహిళ.. కన్న తల్లి దండ్రులను, సోదరలు, స్నేహితులను విడిచిపెట్టి పుట్టినుంచి నుంచి మెట్టి నింత అడుగుబెడుతుంది స్త్రీ.. అలాంటి స్త్రీని కంటికి రెప్పలా చూసుకునే వారు ఎందరు..? భార్య అనే చిన్న చూపుతో.. తమ ఇంట్లో పనిమనిషిగా కంటే హీణంగా చూస్తుంటారు.. తాను కూడా ఒక ఇంటికి కోడలు అన్న విషయం మరచిన కొందరు అత్తలు తమ కోడల్నిని రాచి రంపాన పెడుతుంటారు.. ఇది వినాశనానికి దారి తీస్తుంది.. స్త్రీ అంటే కేవలం కోరిక తీర్చుకునే సాధనంగా కాకుండా.. ఒక కుటుంబానికి దారిచూపే చుక్కాని అన్న నిజాన్ని గ్రహించాలి.. అప్పుడే ఈ సమాజం పరిపుష్టం అవుతుంది.. దేవుడు అందరి ఇండ్లలో ఉండలేక తన తరఫున ఒక స్త్రీని ప్రతి ఇంట్లో వుంచుతాడట.. అది అమ్మ కావచ్చు, ఆలి కావచ్చు, సోదరి కావచ్చు.. ఏ రూపాన ఉన్నా స్త్రీ అనేది ఒక అద్భుతమైన రూపం.. ఆ రూపాన్ని భద్రంగా పదిలపరుచుకుందాం..ప్రతి ఏడాది మార్చి నెలలో ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకుంటాం.. ఆరోజు ఎంతో హంగామా సృష్టిస్తాం.. కానీ ఆ మరుసటి రోజే మర్చిపోతాం.. ఇది కాదుకదా స్త్రీకి మనమిచ్చే నిజమైన గౌరవం..? స్త్రీకి ఒక రోజంటూ ఉండదు.. సర్వకాల సర్వావస్థల యందూ స్త్రీ ఉనికి మనకు ఎంతో అవసరం ఇది గ్రహించమని కోరుతోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ".. ఈ క్రమంలోనే గృహ హింస నిరోధక చట్టం 2005 గురించి పూర్తి వివరాలు అందిస్తోంది..
ముఖ్యంగా మహిళలకు ఎక్కడైతే రక్షణ కొరవడిందో, ఎక్కడైతే హింసకు గురౌతుందో అక్కడే వుండి తన న్యాయపోరాటం కొనసాగించే వెసులు బాటు ఈ చట్టం ద్వారా లభించింది. మహిళలకు తాము నివసించే ఇంటిలో హక్కును మొదటి సారి ఈ చట్టం కల్పించింది. ఈ నివాస హక్కు అనేది ఈ చట్టంలో అతి ముఖ్యమైన అంశంగా చెప్పుకోవాలి.
ఇది సివిల్ చట్టం అయినప్పటికీ పకడ్బందీగా అమలు కోసం నేరన్యాయ వ్యవస్థకు అమలు భాద్యత పొందుపరిచారు. వైవాహిక జీవింతంలోని సున్నితమైన భార్యభర్తల సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని, పోలీస్ పాత్రని పరిమితం చేస్తూ మేజిస్ట్రేట్ పాత్రని, కుటుంబపెద్దగా హింసకు పాల్పడే పురుషులకు కౌన్స్ లింగ్ సౌకర్యం కల్పిస్తూ హింసకు పాల్పడరాదనీ ఆదేశాలిస్తూ చిన్న చిన్న సమస్యలను సరిదిద్దేలా మేజిస్ట్రేట్ పాత్రని రూపొందించారు. మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించిన పక్షంలో ఇది క్రిమినల్ కేసవుతుంది. నిందుతులని శిక్షించే వీలు కూడా ఈ చట్టంలో పొందుపరిచారు.
కుటుంబాల్లో స్త్రీలు ఎదుర్కొనే హింసని చాలా విస్తృతంగా నిర్వచించింది ఈ చట్టం. శారీరక హింస, లైంగిక హింస, భావోద్రేక హింస, మానసిక హింస, ఆర్ధిక హింసలను వివరంగా నిర్వచిస్తూ ఇలాంటి హింసలన్ని ఈ చట్ట పరిధిలోకి తెచ్చారు.
గృహహింస నిరోధక చట్టం కింద మహిళలకు రక్షణ చేకూర్చే కొన్ని సంస్థల వివరాలు :
రక్షణాధికారులు :
ఈ చట్టం సక్రమంగా అమలవ్వడంలో ముఖ్య పాత్ర పోషించేది రక్షణాధికారులే . భాధితురాలికి ఉచిత న్యాయ సేవలు, ఆర్ధిక సహయం, పిల్లల కస్టడి, ఆశ్రయం అందించే సంస్థల వివరాలు, వైద్య సహయం మొదలైన సమాచారాన్ని అందించడం రక్షణాధికారి ముఖ్య భాద్యత. కుటుంబ హింసకు గురైన భాధితురాలు రక్షణాధికారిని కలిసి తన ఫిర్యాదును ఇవ్వవచ్చు. ప్రతి జిల్లాలోను ఐ.సి.డి. ఎస్.పి.డి నే రక్షణాధికారిగా నియమించారు. రెవెన్యూ డివిజన్లలో ఉండే ఆర్.డి.వో.లు కూడా రక్షణాధికారులే.
సర్వీస్ ప్రొవైడర్లు లేదా సహాయసంస్థలు :
కుటుంబహింస నుండి మహిళలకు రక్షణ చట్టం 2005 అమలులో రక్షణాధికారులకు ఎంత కీలక పాత్ర వుందో సర్వీస్ ప్రొవైడర్లకు కూడా అంతే ముఖ్య పాత్ర వుంది. ఆయా ప్రాంతాలలో పనిచేసే స్వచ్చంద సంస్థలు, సర్వీస్ ప్రొవైడర్స్ గా ప్రభుత్వంలో రిజిస్టర్ చేయించుకోవాలి. ఈ క్రమంలోనే స్త్రీల సమస్యలపై పనిచేసే 72 స్వచ్చంధ సంస్థలను ప్రభుత్వం సర్వీస్ ప్రొవైడర్ల్ గా నియమించింది.
కుటుంబ హింసకు గురైన భాదిత మహిళ కోరితే కుటుంబ హింస నివేదిక (డి.ఐ.ఆర్)ను తయారు చేసి రక్షణాధికారికి లేదా మేజిస్ట్రేట్ కి ఇవ్వడం, వైద్య సహాయం అందించడం, షెల్టర్ హోంలో ఆశ్రయం కల్పించడం లాంటి విధాముగ సర్వీస్ ప్రోవైడర్లు నిర్వర్తించాలి.
మేజిస్ట్రేటు బాధ్యతలు :
కుటుంబహింసకు గురైన బాధిత మహిళ నేరుగా మేజిస్ట్రేట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ చట్టం కింద బాధితురాలు కొన్ని ఉపశమనాలను మేజిస్ట్రేటును కోరవచ్చు.
ప్రతివాదితో కలిసివున్న ఇంటిలో నివసించే హక్కు.. రక్షణ ఉత్తర్వులు.. వేరుగా వుండేందుకు నివాసహక్కులు.. ఆర్ధిక ఉపశమన ఉత్తర్వులు.. పిల్లల ఆధీనపు ఉత్తర్వులు.. భాదితురాలిని ఫొన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా, ఇ మెయిల్ ద్వారా మానసిక వేదనకు గురిచేస్తే వాటిని నిలుపుదల చేస్తూ మేజిస్ట్రేటు ఉత్తర్వులివ్వవచ్చు. గృహహింసకు సంబందించిన కేసులను 60 రోజుల్లో విచారించి తీర్పు నివ్వాలి. కోర్టు ఉత్తర్వులను నిందితులు ఉల్లంఘిస్తే ఏడాది జలు శిక్ష గాని, రూ. 20,00 జరిమానా గానీ రెండింటిని గానీ మేజిస్ట్రేటు విధించవచ్చు.
పోలీసుల పాత్ర :
ఈ చట్టం సివిల్ చట్టం కాబట్టి దీని అమలులో పోలిసుల పాత్ర నామమాత్రమే. అయితే భాదిత మహిళ కుటుంబహింసకు సంబందించిన ఫిర్యాదు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కు వస్తే గృహహింస చట్టం గురించి, ఆ చట్టం ద్వారా లభించే ఉపశమనాల గురించి ఆమెకు వివరించి రక్షణాధికారి దగ్గరకు గానీ, సర్వీస్ ప్రోవైడర్ల దగ్గరకు గాని ఆమెను పంపించాలి. ఇక మేజిస్ట్రేటు జారీ చేసిన వివిధ ఉత్తర్వులని ప్రతివాది ఉల్లంఘిస్తే అది నేరమౌతుంది. ఈ అంశాన్ని భాధితురాలు కోర్టు దృష్టికి గాని, పోలీసుల దృష్టికి గాని తేవాల్సి వుంటుంది. ఉత్తర్వుల అమలు చేయడంలో పోలిసులు తప్పని సరిగా రక్షణాధికారికి సహకరించాలి.
ఏ మహిళ అయినా గృహ హింసకు గురైతే " ఫోరం ఫార్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ" ను సంప్రదించండి.. మీకు తగిన సూచనలు, సలహాలు ఉచితంగా అందిస్తాం..