ప్రత్యేక సాక్షుల కథనం ప్రకారం 22,లక్షల 80000/- కల్తీ మద్యం స్వాధీనం
అధికారుల అండదండలు లేకుండా ఇంత పెద్ద దందా కొనసాగదని గ్రామస్తుల వాదన
250 కాటన్ లు జెసిబి ట్రాక్టర్ సీజ్
తవ్వకాలు జరిపి మరీ స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ శాఖ
రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గాకుండా విచారణ జరగాలి.ప్రతిపక్ష నాయకులు
స్థానిక సంస్థల లబ్ధి కొరకే పార్టీల రంగు పూత
సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) జూలై 23: ఏపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారి సమాచారంతో తెలంగాణ స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్, భారీగా స్పిరిట్ నకిలీ లేబుల్స్ భారీ కాటన్లలో కల్తీ మద్యం ఎక్సైజ్ హీల్స్, ఫోర్ వీలర్ స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేసి విచారణ చేయడం జరిగింది సిండికేట్ మద్యం టెండర్ దారుల అత్యాశతో సంపాదినే ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వారి కుటుంబాల బాగు కొరకు ఇతర కుటుంబాలను నాశనం అయినా తమకు ఏమి అవుతుందని అధికారుల అండ ఉన్నంతవరకు అన్న చందంగా మేళ్లచెరువు చింతలపాలెం మఠంపల్లి మండలానికి చెందిన బడాబాబులు మద్యం టెండర్లు పొందినవారు.
సిండికేట్ అవతారమెత్తి హుజూర్ నగర్, కోదాడ, నియోజకవర్గాలలో,ఆంధ్రా ప్రాంతాలకు కల్తీ మద్యాన్ని అమ్మకాలు చేస్తున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి ఎక్సైజ్ శాఖ అమ్మకాలపై ఉన్న దృష్టి షాపులలో ఏ ఏ మద్యం అమ్ముతున్నారో ఎలాంటి తనిఖీలు చేయకపోవడంతో సిండికేట్ మాఫియాకు మూడు పువ్వులు ఆరు కాయల్లా కల్తీ మద్యం ఏరులై పారుతుంది. ఇప్పటికైనా అధికారులు కల్తీ మద్యానికి సహకరించిన వారి అందరి పై ప్రత్యేక నిఘవర్గాలతో జిల్లా స్థాయి అధికారులతో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గాకుండా విచారణ జరగాలని ప్రతిపక్ష నాయకులు కోరుతున్నారు.
మేళ్లచెరువు మండలంలోని రామాపురం గ్రామంలో కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠా తయారుచేసిన మద్యం సుమారు 250 కాటన్ లు ఒక్కొక్క కాటన్ లో 48 కోటర్స్ ఒక్కొక్క కోటర్ విలువ 190 రూపాయలు. మొత్తం 12వేల కల్తీ మద్యం కోటర్స్ సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రత్యేక సాక్షుల కథనం బట్టబయలైంది బుధవారం రాత్రి హుజూర్నగర్ ఎక్సైజ్ శాఖ అధికారులు జిల్లా ఎక్స్చేంజ్ అధికారులు సంయుక్తంగా రామాపురంలో కల్తీ మద్యం లో నిందితుడు శివశంకర్ స్నేహితుడు రంగి శెట్టి సైదేశ్వరరావు పొలంలో రెండు చోట్ల భారీ తవ్వకాలు చేసి దాచిపెట్టిన 250 కాటన్ల కల్తీ మద్యాన్ని ఎక్సేంజ్ అధికారులు తవ్వకాలు జరిపి మరి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం మద్యం దాచేందుకు తరలించేందుకు సహకరించిన జెసిబి, ట్రాక్టర్ లను సీజ్ చేసి అదుపులో తీసుకున్నారని సమాచారం ఇంకా మరిన్ని చోట్ల విచారణ జరిపే అవకాశం ఉందని ప్రత్యేక సాక్షుల వాదన 12000×190/--22,80,000/- విలువ ఉండవచ్చని అంచనా ఇంకా మరిన్ని దాడులు జరుగుతున్నాయని సమాచారం.
ఇట్టి విషయాలపై ఎక్సైజ్ శాఖ మీడియాకు సమాచారం ఇవ్వకుండా జాగ్రత్త పడడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇంత భారీ స్కామ్ లో నిజమైన నిందితులను, సహకరించిన బడా బాబులను పక్కన పెట్టి కొసరి వ్యక్తులను పట్టుకుని తీగలాగుతున్నట్లుగా డొంకను కదిలించే పరిస్థితి కొనసాగడం లేదని పార్టీ రంగు పూసి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేలా చూస్తున్నారని రామాపురం గ్రామాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బిహారీలను తీసుకొచ్చి ఆంధ్ర వ్యక్తులు తెలంగాణ బడా బాబులను కలుపుకుని పెద్ద ఎత్తున కల్తీ మద్యం తయారు చేస్తుంటే ఆంధ్రా పోలీసులు చెప్పేంత వరకు తెలియదా అంటూ ఇందులో అందరి అధికారుల ప్రమేయం లేకుండా ఇంత పెద్ద దందా కోనసాగదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.