విద్యాసంస్థల బంద్ విజయవంతం

వామపక్ష విద్యార్థి సంఘాలు పి.డి.ఎస్.యు ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్. 

విద్యాసంస్థల బంద్ విజయవంతం

సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి )జూలై 23: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోతలపెట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతంగ నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు, జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ధనియాకుల శ్రీకాంత్ వర్మ, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు గడ్డం నాగరాజు, పివైఎల్ నాయకులు బండి రవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు కార్పోరేట్ విద్యాసంస్థలలో ఫీజులు నియంత్రణ చట్టం తీసుకురావాలని ఖాళీగా ఉన్న టీచర్, ఎం ఇ ఓ,డిఈఓ పోస్టులను భర్తీ చేయాలని ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, పెండింగ్ లో ఉన్న మెస్, కాస్మోటిక్ చార్జీలను విడుదల చేయాలని, బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలను విడుదల చేయాలని, ఎయిడెడ్ పాఠశాలలకు నిధులను కేటాయించాలని, విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత బస్సు పాస్ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రిన్సిపల్, లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని, నూతన జాతీయ విద్యా విధానం 2020 ను తెలంగాణలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని అద్దె భవనాలలో కొనసాగుతున్న వసతి గృహాలను సొంత భవనాలు నిర్మించి సౌకర్యాలు కల్పించాలని విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలని విద్యా కమిషన్ సిఫారసు చేసిన సూచనలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ బందు నిర్వహించడం జరిగిందని ఇప్పటికైనా ప్రభుత్వం పై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. లేకుంటే భవిష్యత్తులో ప్రత్యక్షమైన ఆందోళనలకు పిలుపునిస్తామని ఎమ్మెల్యే, ఎం పి, మినిస్టర్ ఇండ్ల ముట్టడిలకు పిలుపునిస్తామని తెలిపారు. ఈబంద్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నామ ని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ నాయకులు లెనిన్, మాధవ్, శ్రావణ్ శివ, జస్వంత్ వినయ్ సంతోష్, శివతేజ తదితరులు పాల్గొన్నారు.

Read More నారిశక్తి కార్యక్రమం పై పోలీసు అక్కలతో జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల

About The Author