సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..
- సరైన నైపుణ్యం కలిగి ఉండాలి.. లేకపోతే తెలుసుకోవాలి..
- గుర్తుతెలియని లింక్ లను ఓపెన్ చేయకూడదు..
- అపరిచిత ఫోన్ కాల్స్ కు జవాబు ఇవ్వకూడదు..
- టీనేజ్ పిల్లలపై ఒక కన్నేసి ఉంచాలి..
- మీ వ్యక్తిగత వివరాలు సోషల్ మీడియాలో పంచుకోవద్దు..
- ముఖ్యంగా అత్యాశకు పోవడం అతిపెద్ద పొరబాటు..
- లేని సుఖాలకోసం అర్రులు చాచడం అనర్ధం..
- ఇంటర్ నెట్ లేని సమయంలో మనం ఎలా గడిపాం..?
- నేరస్తులు కొత్త పుంతలు తొక్కుతున్నారు..
- స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వండి..
- వాస్తవంలో జీవిస్తే ప్రపంచం మీకు అర్ధం అవుతుంది..
- ఏదైనా అనుమానం వచ్చినప్పుడు పోలీసులను సంప్రదించాలి..
- సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతోంది.. ప్రపంచం ముందడుగువేయడం సంతోషదాయకమే.. కానీ కొందరు దుర్మార్గులు టెక్నాలజీని అడ్డగోలుగా, తమకు అనుకూలంగా మలుచుకుని కేవలం నేర ప్రవృత్తితో.. స్వలాభంకోసం వినియోగిస్తున్నారు.. దీనికోసం తర తమ బేధాలు మరచి విశృంఖల పద్ధతులు అనుసరిస్తున్నారు.. ఈ క్రమంలో అమాయకులు బలైపోతుండటం చూస్తున్నాం.. ప్రభుత్వాలు, పోలీసులు ఎంతగా ప్రయత్నిస్తున్నా ఇలాంటి నేరగాళ్ళను కట్టడిచేయలేకపోతున్నారు.. దేశం కోసం ఉపయోగించాల్సిన మేధస్సును కొందరు నేర ప్రపంచంలో విహరించడానికి వినియోగిస్తున్నారు.. దీంతో పోలీసు వ్యవస్థ ఎంతగా ప్రయత్నిస్తున్నా కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తూ సైబర్ నేరగాళ్లు తప్పించుకుంటున్నారు.. వ్యవస్థకే వారు సవాల్ విసురుతున్నారు.. అయితే ఈ సైబర్ నేరాలు ఒక్కోసారి కొన్ని ప్రయోజనాలను అందిస్తాయని నిపుణులు చెబుతుండటం కొంతమేర ఆశ్చర్యానికి గురిచేసే అంశం.. " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ " వారు భారత శక్తి పాఠకుల కోసం అందిస్తున్న పరిశోధనాత్మక కథనం..
హైదరాబాద్, 23 జులై ( భారత శక్తి ) :
నిజానికి సైబర్ నేరాల యొక్క ప్రయోజనాలు ఏమిటి..? ఎదురయ్యే సమస్యలు ఏమిటి ఇవన్నీ చర్చించాలంటే.. సమాజం, సాంకేతికత, భద్రతపై దాని ప్రభావం గురించి కొంత అవగాహన అవసరం.. అయితే నేరంతో ముడిపడి ఉన్నప్పుడు "ప్రయోజనాలు" అనే పదం వినడానికి విచిత్రంగా అనిపిస్తుంది.. కానీ ఇది సైబర్ నేరానికి అనుగుణంగా ఎదురయ్యే మనం ఊహించని సానుకూల ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి అంటున్నారు విశ్లేషకులు..
అసలు ఒక సైబర్ నేరం జరిగితే దాని ప్రయోజనాలు ఏమిటి..? :
సైబర్ నేరాల ప్రభావం ఎక్కువుగా ఎదురైనప్పుడు వాటిని నివారించడాని సైబర్ భద్రతా టెక్నాలజీ, మిగతా పద్ధతులలో సరికొత్త కోణాలను ఆవిష్కరించడానికి అవకాశం కలుగుతుంది.. వ్యాపారాలు, ప్రభుత్వాలు డేటాతో పాటు తమ తమ నెట్‌వర్క్‌లను భద్రపరచడంలో ఎక్కువుగా ప్రాధాన్యత ఇస్తాయి.. సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి అధిక మొత్తంలో వెచ్చిస్తాయి.. అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడానికి సుముఖంగా ఉంటాయి.. దీనివల్ల మరింత అధునాతనమైన భద్రతా సాధనాలు, ప్రోటోకాల్‌ల అభివృద్ధికి ఈ సైబర్ నేర పరిస్థితులు దారితీస్తాయి.. ఎలాంటి సైబర్ సమస్యలు లేవు అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరిలో ఉదాశీనత చోటు చేసుకుంటుంది.. దానివల్ల అభివృద్ధి కుంటుబడే అవకాశం ఉంటుంది.. అందుకే అంటారు ఒక సినిమాలో హీరో శక్తిమంతుడిగా కనిపించాలంటే విలన్ అంతకంటే శక్తిమంతుడిగా కనిపించాలి అని.. అలాగే ఒక వ్యతిరేకత ఎదురైనప్పుడు సానుకూలత బలపడుతుంది.. కష్టం ఎదురైనప్పుడు ఎలా దానిని దాటాలో తెలుస్తుంది.. అందుకే సమాజంలో ప్రతికూల వాతావరణం కూడా ఉండాలన్నది తప్పని సరి..
ఎందుకంటే సైబర్ నేరాల పెరుగుదల సైబర్ భద్రత యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహనను పెంచిందని చెప్పవచ్చు.. దీని పర్యవసానంగా.. వ్యక్తులు, సంస్థలకు సురక్షితమైన ఆన్‌లైన్ పద్ధతులపై ఎంతో ఉన్నతమైన పద్ధతులు నేర్చుకోవడానికి ఒక మార్గం చూపిందని చెప్పవచ్చు.. తమ భద్రతపై అత్యంత నైపుణ్యంతో కూడిన అవగాహన కలిగివుండే సంస్కృతిని పెంపొందించింది.
అంతే కాకుండా సైబర్ నేరాలను ఎదుర్కోవాల్సిన అవసరం, సైబర్ సెక్యూరిటీ నిపుణులకుడిమాండ్ పెరిగింది.. దీనితో సైబర్ రక్షణ, ఎలాంటి ముప్పు సంభవిస్తుంది, దానిని ఎలా ఎదుర్కోవాలి లాంటి విషయాల్లోనూ నైపుణ్యం కలిగిన వ్యక్తులకు ప్రాధాన్యత పెరిగింది.. ఈ క్రమంలో ఎన్నెన్నో ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి.. అయితే సైబర్ నేరాల ముప్పు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలను డిజిటల్ భద్రత, గోప్యత, ముఖ్యమైన డేటా రక్షణకు సంబంధించిన బలమైన చట్టాలు, నిబంధనలను అభివృద్ధి చేయడానికి వాటిని అమలు చేయడానికి అవకాశం లభించింది.. ఆ దిశగా రాజకీయ పెద్దలు, మేధావులు ఆలోచించే దిశగా ఎంతో ప్రేరణ కలిగించింది.. సైబర్ నేరాలను అదుపుచేయడానికి అన్ని కంపెనీలు సురక్షితమైన లావాదేవీలు, పరస్పర చర్యలను నిర్ధారించడానికి వారి డిజిటల్ సేవలను ముందుకు తీసుకుని వస్తాయి.. ఆసేవలను ఎంతగానో మెరుగు పరుచుకుంటాయి.. వినియోగదారులకు మరింత సురక్షితమైన, సమర్థవంతమైన ఆన్‌లైన్ సదుపాయాలతో ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి..
సైబర్ నేరాలతో ఎదురయ్యే ప్రతికూలతలు ఒకసారి చూస్తే :
ఆర్థిక నష్టాలు :
సైబర్ నేరం చేసే వ్యక్తులు, వ్యాపారస్తులకు, ప్రభుత్వాలకు గణనీయమైన ఆర్థిక నష్టాలను కలిగిస్తాయి.. ఈక్రమంలో నిధుల ప్రత్యక్ష దొంగతనం, దెబ్బతిన్న వ్యవస్థలను మరమ్మతు చేయడానికి సంబంధించిన ఖర్చులు, డౌన్‌టైమ్ కారణంగా వ్యాపారం కోల్పోవడం లాంటివి ఉంటాయి.
డేటా దొంగిలించడం :
సైబర్ నేరగాళ్లు తరచుగా వ్యక్తిగత, సున్నితమైన సమాచారానికి ఎంతో నష్టం కలిగిస్తారు.. ఇది అత్యంత కీలకమైన రహస్యాలు, ముఖ్యమైన డేటాను దుర్వినియోగం చేస్తారు.. దేశ భద్రతకు కూడా ఎంతో విఘాతం కలిగిస్తారు..
ప్రతిష్టకు తీరని నష్టం :
సైబర్ దాడులు ప్రముఖ సంస్థల ప్రతిష్టను దెబ్బతీస్తాయి.. దీని వలన వినియోగదారుల విశ్వాసం ఆ కంపెనీలు కోల్పోతాయి.. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం మొదలైనవి..
మౌలిక సదుపాయాలకు అంతరాయం :
రాన్సమ్‌వేర్ వంటి సైబర్ దాడులు వ్యాపారాలు, కీలకమైన మౌలిక సదుపాయాల కార్యకలాపాలకు అంతరాయం కలిగించవచ్చు.. సేవలపై ప్రభావం చూపుతాయి.. లాజిస్టికల్ సవాళ్లను కలిగిస్తాయి. సైబర్ నేరాల నుండి సమర్థవంతంగా రక్షణ పొందడానికి వ్యక్తులు గానీ, సంస్థలు కానీ అనేక రకాల వ్యూహాలను అవలంబించవచ్చు. ప్రధానమైన ఏడూ పరిష్కారాలు ఇప్పుడు చూద్దాం
బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లు, మల్టీ ఫ్యాక్టర్ అతేంటికేషన్ ఉపయోగించడం :
ఊహించడానికి కష్టతరమైన, సంక్లిష్టమైన పాస్‌వర్డ్‌లను సృష్టించి వాటిని ఉపయోగించండి.. అదేవిధంగా విభిన్న ఖాతాలకు వేర్వేరు పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి. దీనితో అదనపు భద్రత చేకూరుతుంది.. ఎందుకంటే ఒక ఖాతాను మనం ఉపయోగించడానికి ఒకటి కంటే ఎక్కువ ధృవీకరణ పద్ధతులు ఎంతో అవసరం.
సాఫ్ట్‌వేర్, సిస్టమ్‌లను క్రమం తప్పకుండా కొత్తగా అప్ గ్రేడ్ చేయడం :
ఆపరేటింగ్ సిస్టమ్‌లు, యాంటీవైరస్ ప్రోగ్రామ్‌లు, అప్లికేషన్‌లతో సహా అన్ని సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు తాజాగా ఉంచండి. ఎందుకంటే రెగ్యులర్ అప్‌డేట్‌లలో తరచుగా సైబర్ నేరస్థులు దోపిడీ చేయగలుగుతారు..
మీదగ్గర పనిచేసే ఉద్యోగులను పూర్తిగా అర్ధం చేసుకోండి :
సైబర్ భద్రతా ఉత్తమ పద్ధతులపై క్రమం తప్పకుండా శిక్షణ, అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సైబర్ నేరాల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.. ఇందులో ఫిషింగ్ ప్రయత్నాలను గుర్తించడం, సురక్షితమైన బ్రౌజింగ్ అలవాట్లు, సున్నితమైన సమాచారాన్ని సరైన పద్దతిలో నిర్వహించేలా జాగ్రత్త వహించండి..
నెట్‌వర్క్, ఇతర పరికరాలను భద్రతపరచడం :
మీ నెట్‌వర్క్‌ను రక్షించడానికి ఫైర్‌వాల్‌లను ఉపయోగించండి. మీ యొక్క వై ఫై నెట్‌వర్క్‌లను భద్రపరచండి.. ఒకవేళ పబ్లిక్ వై ఫై ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. మొబైల్ పరికరాలతో సహా మీ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయబడిన అన్ని పరికరాలు తగిన భద్రతా చర్యలతో సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోండి.
డేటాను క్రమం తప్పకుండా బ్యాకప్ చేయడం :
మీ డేటాను ఇన్ బిల్ట్ హార్డ్ డ్రైవ్ లో కాకుండా బయట హార్డ్ డ్రైవ్ లేదా క్లౌడ్ సర్వీస్ వంటి సురక్షితమైన చోటుకు ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా బ్యాకప్ చేసి పెట్టుకోండి.. రాన్సమ్వేర్ వంటి భయంకరమైన సైబర్ దాడి జరిగినప్పుడు, ఈ విధంగా చేసి ఉంచుకోవడం ఎంతో ఉపయోగపడుతుంది.. అంతేకాకుండా మీ డేటాను పునరుద్ధరించడానికి వీలుంటుంది..
భద్రతా సాఫ్ట్‌వేర్ ను ఉపయోగించండి :
యాంటీవైరస్, యాంటీ-మాల్వేర్, యాంటీ-స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌లతో సహా సమగ్ర భద్రతా పరిష్కారాలను ఉపయోగించుకోండి. సంస్థాగత నెట్‌వర్క్‌ల కోసం ఐడీఎస్, ఐపీఎస్ వంటి అధునాతన భద్రతా సాధనాలను మాత్రమే ఉపయోగించండి.. అదే కాకుండా మీ
వ్యక్తిగత, సున్నితమైన సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తగా ఉండండి.. ఇక ఎప్పుడైనా మీరు ఆన్‌లైన్‌లో పంచుకునే సమాచారాన్ని గుర్తుంచుకోండి. ప్రమాదకరమైన, సురక్షితం కానీ వెబ్‌సైట్‌లు లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకుండా ఉండండి. వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారం కోసం ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే తొందరపడకండి.. అలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండండి..