జోనల్‌ కమిషనర్‌ వికాస్‌ మహతోను: కలిసిన మాజీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి

జోనల్‌ కమిషనర్‌ వికాస్‌ మహతోను: కలిసిన మాజీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి

హయత్‌నగర్‌:

ఎల్‌బీ నగర్‌ జోనల్‌ కమిషనర్‌గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన వికాస్‌ మహతోను హయత్‌నగర్‌ మాజీ కార్పొరేటర్‌ కళ్లెం నవజీవన్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకలగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజా సమస్యలే ప్రాధాన్యత కావాలి
జోన్ పరిధిలో పారిశుద్ధ్యం, రోడ్ల మరమ్మతులు, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా నవజీవన్ రెడ్డి కోరారు. ముఖ్యంగా హయత్‌నగర్‌ డివిజన్ పరిధిలోని పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

సమిష్టి కృషితో అభివృద్ధి
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. జోనల్‌ కమిషనర్‌ను కలిసిన వారిలో బీజేపీ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి గోవిందచారి తదితరులు ఉన్నారు.WhatsApp Image 2026-05-14 at 16.33.13 (1)

About The Author