తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్‌చెరు:
తిరుమల శ్రీవారిని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించారు. శ్రీవారి ఆశీస్సులతో పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆర్థిక అభ్యున్నతి సాధించాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే జిఎంఆర్ తో పాటు సీనియర్ నాయకులు విజయ్ కుమార్, అశోక్, చంద్రశేఖర్, ఎమ్మెల్యే జిఎంఆర్ సోదరుడి కుమారుడు గూడెం సందీప్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు.
About The Author
19 Apr 2026
