మధ్యవర్తిత్వంతో న్యాయ వివాదాల పరిష్కారం

సీనియర్ సివిల్ జడ్జి రాధిక జైస్వాల్.

మధ్యవర్తిత్వంతో న్యాయ వివాదాల పరిష్కారం

 ఉమ్మడి కరీంనగర్ జిల్లా బ్యూరో సయ్యద్ అలీ, జూలై 22 (భారతశక్తి ): మధ్యవర్తిత్వం ద్వారా వివిధ పౌర కుటుంబ, సంబంధిత వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడమే లక్ష్యంగా మధ్యవర్తిత్వం కార్యక్రమం నిర్వహించ బడుతోందని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికర సంస్థ, హైదరాబాద్ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికర సంస్థ, రాజన్న సిరిసిల్ల అధ్యక్షురాలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి పి. నీరజ సూచనల మేరకు 40 గంటల మధ్యవర్తిత్వ శిక్షణా కార్యక్రమం కోసం సిరిసిల్ల, వేములవాడ యొక్క ఆసక్తిగల న్యాయవాదుల జాబితాను తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికర సంస్థ, హైదరాబాద్ కు పంపడం జరిగిందని కార్యదర్శి రాధిక జైస్వాల్ తెలిపారు.ఈ సందర్భంగా కార్యదర్శి రాధిక జైస్వాల్ మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకుంటే కోర్టులో నడిచే ఖర్చు,సమయం, మానసిక ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు.ఇరు పక్షాల సమ్మతితో నిపుణుల ద్వారా సమస్య పరిష్కారం పొందే అవకాశమిది అని అన్నారు.ఈ మధ్యవర్తిత్వం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లాలోని కక్షిదారులను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కోరారు.

About The Author