స్థానిక సంస్థల ఎన్నికల లో గులాబీ జెండా ఎగరాలి
- స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగే పరిస్థితి లేదు
- బిఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో ఒంటెద్దు నరసింహారెడ్డి
సూర్యాపేట జిల్లా బ్యూరో(భారతశక్తి) జూలై22:
హుజూర్ నగర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్ నందు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆదేశానుసారం, హుజూర్ నగర్ మాజీ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి ఆధ్వర్యంలో మండల ప్రధాన కార్యదర్శి అబ్దుల్ నబీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన హుజూర్ నగర్ మండల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, హుజూర్ నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి పాల్గొన్నారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సర్పంచ్, ఎంపీటీసీల పదవీకాలం ముగిసి ఏడాదిన్నర గడుస్తున్నప్పటికీ ఎన్నికలు నిర్వహించకపోవడం కాంగ్రెస్ పార్టీ అసమర్థ పరిపాలనకు నిదర్శనమన్నారు. గ్రామాల్లో సర్పంచ్ ఎంపీటీసీలు లేక అభివృద్ధి కుంటుపడిందని పారిశుద్ధ్యం, రోడ్ల నిర్వహణ లాంటి చిన్న చిన్న సమస్యలు కూడా నెరవేర్చలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని తెలిపారుసకాలంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వలన తెలంగాణ పల్లెల్లోకి కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు 1170 కోట్లు రాకుండా పోయి తెలంగాణ పల్లెలు నష్ట పోయాయన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు గ్యారంటేలు 420 హామీలు అని చెప్పి ఒకటీ అమలు చేయకుండా దొంగ హామీలతో గద్దెనెక్కి ఇప్పుడు వాటిని విస్మరించారని సోనియా రాహుల్,ప్రియాంక లాంటి జాతీయ నాయకుల్ని తీసుకొచ్చి డిక్లరేషన్లు ఇచ్చి ఒక్కటీ నెరవేర్చలేదన్నారు.రైతుబంధు, రైతు బీమా కల్యాణ లక్ష్మి, మొదలుకొని పింఛన్లు, స్కూటీలు, మహిళలకు 2500, ఇందిరమ్మ ఇండ్లు, గ్యాస్ లాంటి పథకాలు ఇస్తామని చెప్పి ఆయొక్క వర్గాలను పూర్తిగా నిరాశపరిచారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగే పరిస్థితి లేదు, ప్రజల్లో పూర్తి వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో వారి అభ్యర్థులు ధైర్యాన్ని కోల్పోయారు అన్నారు మన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎన్నికలకు సమాయత్తమై, సమిష్టిగా పనిచేసి గ్రామాల్లో బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి మన సత్తాను చాటాలి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి నాటి కెసిఆర్ ప్రభుత్వంలో తెలంగాణ గ్రామాలలో జరిగిన అభివృద్ధిని ప్రజలకి గుర్తు చేయాలన్నారు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంటూ ప్రతిపాదన తెచ్చి బీసీలను మభ్య పెట్టాలని చూస్తున్నారని అది కార్యరూపం దాల్చే ప్రసక్తే లేదు అన్నారు రైతులని రైతు బీమా, రైతు భరోసా పేరిట మోసం చేసి రైతు రాజ్యం తెస్తామంటూ కాంగ్రెస్ నాయకులు చెప్పిన నిలువన మోసం చేశారన్నారు రైతులకు రైతు భరోసా పేరిట బకాయి పడ్డాయి 27 వేల కోట్ల ధనం ఏమైనట్టు,ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ నాయకులు జేబులు నింపుకుంటున్నారు.ప్రతి కాంట్రాక్టులో, ప్రతి పనిలో 20 శాతం కమిషన్ తీసుకుంటున్నారంటూ మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు తీవ్రస్థాయిలో ఉంది, ముఖ్యమంత్రి సీటు నుండి ఎప్పుడు గద్దె దించుతారోనని రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందిరేవంత్ తన గురువు చంద్రబాబు కాలచంతన చేరి తెలంగానాని బాబుకి పణంగా పెట్టాడు. 18 నెలల్లో ఢిల్లీకి 48 సార్లు వెళ్లి ఒక్కసారి కూడా రాహుల్ అపాయింట్మెంట్ దొరక్క దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు.కాంగ్రెస్ పార్టీకి బాసులు ఢిల్లీలో ఉంటారని కానీ మన పార్టీకి ప్రతి కార్యకర్త బాసే అని అన్నారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ తిరిగి వస్తారు కాబట్టి కార్యకర్త ధైర్యం కోల్పోకుండా ఉండాలి.కష్ట కాలంలో పార్టీని వదిలేసి వేరే పార్టీలో చేరిన వారిని తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదని ఒంటెద్దు నరసింహారెడ్డి అన్నారు.
ఇట్టి కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ కె ఎల్ ఎన్ రెడ్డి, హుజూర్నగర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్,మాజీ సర్పంచులు గుజ్జుల సుజాత అంజిరెడ్డి, షేక్ అలీ కీత జయమ్మ ధన మూర్తి, పత్తిపాటి రమ్య నాగరాజు, గల్లా సైదులు,అద్దంకి సైదేశ్వర రావు, పల్లె నాగిరెడ్డి,మాజీ ఎంపీటీసీ చికూరి రాజారావు, మాజీ వైస్ ఎంపీపీ మల్లెపల్లి వీరబాబు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ కామిశెట్టి వెంకటేశ్వర్లు, మండల నాయకులు సారెడ్డి భాస్కర్ రెడ్డి, సామల మట్టారెడ్డికట్ట సతీష్, లింగారెడ్డి ముక్కెర్ల మట్టయ్య, నరసింహారావు, గోలి శ్రీను, చికూరు నారాయణ, తోట బిక్షం, మండల యూత్ అధ్యక్షులు వీరమల్ల సుందరయ్య, గొర్రె సూర్యనారాయణ మాడుగుల పరుశురాం కడియం అశోక్ పలు గ్రామాల పార్టీ అధ్యక్షులు , దుగ్గి నరసింహారావు, ఎండి ముజీబ్, గండు సైదులు, వెంగళరావు ఆవులదొడ్డి నరసింహయ్య యాదవ్, మేడి రాము, సామల బ్రహ్మారెడ్డి, జింకల శ్రీనివాస్, చెడపంగు వెంకటేశ్వర్లు, జోజిరెడ్డి, మండల ఉపాధ్యక్షులుసతీష్ వార్డు సభ్యులు పిచ్చి బాబు,రమేష్ బిఆర్ఎస్ నాయకులు వెంకన్న, నకిరేకంటి కోటయ్య, కిరణ్, నాగేశ్వరరావు, సీతారామయ్య, లక్ష్మణ్, దావీద్,సుందర్ తదితరులు పాల్గొన్నారు.