ఆర్ ఎస్ కె లలో రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయి

రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. రైతులకు ఎరువులు సకాలంలో అందాలి- జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

ఆర్ ఎస్ కె లలో రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయి

వైయస్సార్ కడప,జులై 23(భారత శక్తి): రైతులకు ఎరువులు సకాలంలో ఆర్ ఎస్ కె ల ద్వారా అందేలా పక్కా ప్రణాళిక తో క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ రైతుల ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మరియు మార్కెటింగ్ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు.

కలెక్టర్ ఛాంబర్ లో ఎరువుల నిల్వలు, విక్రయాలు, మార్కెటింగ్, పంటలు తదితర అంశాలపై వ్యవసాయ, మార్కెటింగ్ మార్క్ఫెడ్, డిఎస్ఓ శాఖా అధికారులు, ప్రవేట్ ఎరువుల కంపెనీల ప్రతినిధులుతో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్ష నిర్వహించారు. 

Read More రైతు భరోసా కింద భూస్వాములకు ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెడుతోంది.. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ.. రైతులకు ఎరువులు అవసరమైన మేర స్టోరేజీ అందుబాటులో ఉందన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిమాండ్ ఆధారంగా ఎరువులు ఆర్ ఎస్ కే ల ద్వారా అందజేస్తామని తెలిపారు.జిల్లాలో ఇప్పటి వరకు ఆర్ ఎస్ కే లలో 2900 టన్నుల ఎరువులు అందుబాటు లో ఉన్నాయని రైతులు వినియోగించు కోవాలన్నారు.ప్రవేట్ ఎరువుల డీలర్స్ నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌ ఈ-పాస్‌ యంత్రాల ద్వారా మాత్రమే ఎరువులను విక్రయించాలని ఆదేశించారు.

Read More ముఖ గుర్తింపు హాజరు నమోదు శాతం పెంచాలి

బల్క్‌స్టాక్‌ పెట్టుకుని కృత్రిమ కొరత సృష్టించడం వంటి పనులకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. అలాగే డీలర్స్ రైతుల డిమాండ్ ను ఆసరాగా చేసుకుని అనవసరమైన వేరే ఉత్పత్తులను, పోషకాలను లింక్ చేసి అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకొని,వారి లైసెన్సును రద్దు చేస్తామని హెచ్చరించారు. అలాగే అక్రమ ఎరువుల నిలువలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా లో ఎంత ఎరువులు అలాట్మెంట్‌ ఉంది,రైతులకు ఏ మేరకు విక్రయించారు, ప్రస్తుతం ఎంత అందుబాటులో ఉందనే వివరాలను వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Read More జి ప్లస్ త్రీ మోడల్ ఇండ్ల నిర్మాణానికి స్థలసేకరణ పనులు వేగవంతం చేయాలి

జిల్లాలో మార్కెట్ యార్డులలో ఉదయం ఏడు గంటలకే వివిధ జిల్లాల, రాష్ట్రాల పంటల మార్కెట్ ధరల పట్టికను రైతులకు డిస్ప్లే బోర్డుల ద్వారా తెలియజేయాలన్నారు. మార్కెట్ యార్డులలో దళారీలు రైతులను మోసం చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మార్కెటింగ్ శాఖలో పారదర్శకత ముఖ్యమని ఎవరైనా నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు చేపడతామన్నారు.మండల వారీగా ఆర్ఎస్కే లలో స్టాక్‌ వివరాలను ప్రతిరోజు మీడియా ద్వారా రైతులకు తెలియజేయాలన్నారు.

Read More రైతులకు అవసరమైన అన్ని ఎరువులను అందుబాటులో ఉంచాలి..

అలాగే రైతులకు పంటల వారీగా వాట్సాప్ బిజినెస్ గ్రూపును ఏర్పాటు చేసుకొని నిత్యం అందులో రైతులకు అవసరమైన వివరాలు, ప్రయోజనాలను పోస్ట్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ జేడి చంద్రా నాయక్,మార్కెటింగ్ ఏ డి అజాద్ వల్లి,మార్క్ ఫెడ్ డి.ఎమ్ పరిమళజ్యోతి, హార్టికల్చర్ అధికారి రవిచంద్రబాబు,డి సి ఓ వెంకటసుబ్బయ్య, ,కోరమాండల్,స్పీక్, ఐ పీల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Read More గీతం జాతీయ చర్చాగోష్ఠి ప్రారంభోత్సవం.. 

About The Author