రేషన్ డీలర్లు అందరూ ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి : పౌర సరఫరాల అధికారులు, టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి,

భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 12: నిర్మల్ జిల్లా లో మంగళవారం జిల్లాలోని పలు రేషన్ దుకాణాలలో పౌర సరఫరాల అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లక్షణచందా, ఖానాపూర్, సోన్, నిర్మల్ గ్రామీణ మండలలాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిర్ణిత సమయాల్లో రేషన్ దుకాణాలను తప్పనిసరిగా తెరిచి ఉంచాలన్నారు. పేదలకు సమయానికి రేషన్ బియ్యాన్ని అందించాలన్నారు. అన్ని రకాల బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని రేషన్ డీలర్లపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. అన్ని రేషన్ దుకాణాల పరిసరాల్లో పరిశుభ్రతను పాటించాలని తెలిపారు. ఈ తనిఖీలలో టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి, అధికారులు శేఖర్ రెడ్డి, లక్ష్మయ్య, శ్రీనివాస రావు, సుదర్శన్ రెడ్డి, ఎన్ఫోర్స్ మెంట్ డిటీలు కార్తీక్ రెడ్డి, రంజిత్, తదితరులు పాల్గొన్నారు.

రేషన్ డీలర్లు అందరూ ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి : పౌర సరఫరాల అధికారులు, టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి,

భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 12: నిర్మల్ జిల్లా లో మంగళవారం జిల్లాలోని పలు రేషన్ దుకాణాలలో పౌర సరఫరాల అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లక్షణచందా, ఖానాపూర్, సోన్, నిర్మల్ గ్రామీణ మండలలాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిర్ణిత సమయాల్లో రేషన్ దుకాణాలను తప్పనిసరిగా తెరిచి ఉంచాలన్నారు. పేదలకు సమయానికి రేషన్ బియ్యాన్ని అందించాలన్నారు. అన్ని రకాల బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని రేషన్ డీలర్లపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. అన్ని రేషన్ దుకాణాల పరిసరాల్లో పరిశుభ్రతను పాటించాలని తెలిపారు.
ఈ తనిఖీలలో టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి, అధికారులు శేఖర్ రెడ్డి, లక్ష్మయ్య, శ్రీనివాస రావు, సుదర్శన్ రెడ్డి, ఎన్ఫోర్స్ మెంట్ డిటీలు కార్తీక్ రెడ్డి, రంజిత్, తదితరులు పాల్గొన్నారు.

About The Author