దసరా ఉత్సవ కమిటీ నియామకం
ములుగు జిల్లా :

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించు " కొని ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో ములుగులో నిర్వహించనున్న రావ ణాసుర వధ ఉత్సవాలకు కమిటీని ఎన్నుకున్నారు. ఆదివారం ములుగు బొడ్రాయి వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా గండ్రకోట కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా రాసమల్ల శివాజీ, ఓడ రాజు, గాదం దేవేందర్, అబ్బు నరేందర్రెడ్డి, మారబోయిన సంపత్, అను ముల సురేష్, గుండెబోయిన రమేష్, ఎల్కతుర్తి శ్రీహరితో పాటు ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సహాయ కార్యదర్శి, కన్వీనర్, కోశాధికారి, సహయ కోశాధికారి, తొమ్మిది మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకొన్నారు. అనంతరం ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కుమార్ మాట్లాడారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, దీని కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. మీడియా ఇన్చార్జిగా గుగ్గిళ్ళ సృజన్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా హిందూ సంస్కృతి, సాంప్రదాయాల మేల వింపుతో ఘనంగా నిర్వహిస్తామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
